News March 11, 2025

ప్రణయ్ హత్య కేసులో తీర్పు.. అమృత స్పందన ఇదే..

image

TG: ప్రణయ్ <<15710208>>హత్య కేసులో<<>> కోర్టు నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రణయ్ భార్య అమృత ఇన్‌స్టాగ్రాంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. నిన్నటి తేదీని ఉద్దేశించి ‘రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్’ అని రాసుకొచ్చారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత తండ్రి మారుతీరావు 2018లో సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు.

Similar News

News March 12, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,980కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

News March 12, 2025

MLAకు న్యూడ్ కాల్స్ చేసిన నేరగాళ్లు అరెస్ట్

image

TG: కాంగ్రెస్ MLA వేముల వీరేశంకు న్యూడ్ కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారం కిందట దుండగులు న్యూడ్ కాల్స్ చేసి డబ్బులు డిమాండ్ చేయగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సైబర్ నేరగాళ్లను మధ్యప్రదేశ్‌కు చెందినవారిగా గుర్తించారు. అక్కడ వారిని అరెస్ట్ చేసిన పోలీసులు నకిరేకల్ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

News March 12, 2025

Stock Markets: బ్యాంకు షేర్లకు గిరాకీ

image

స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 22,470 (-28), సెన్సెక్స్ 74,045 (-62) వద్ద చలిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. చమురు, ఎనర్జీ, PSE, PVT బ్యాంకు, కమోడిటీస్, ఫైనాన్స్, ఆటో, ఇన్ఫ్రా, మెటల్ షేర్లకు గిరాకీ పెరిగింది. ఐటీ, FMCG, హెల్త్‌కేర్, ఫార్మా, మీడియా షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ ఉంది. ఇండస్ఇండ్, టాటా మోటార్స్, BPCL, కొటక్, HDFC బ్యాంకు టాప్ గెయినర్స్.

error: Content is protected !!