News March 11, 2025

ప్రణయ్ హత్య కేసులో తీర్పు.. అమృత స్పందన ఇదే..

image

TG: ప్రణయ్ <<15710208>>హత్య కేసులో<<>> కోర్టు నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రణయ్ భార్య అమృత ఇన్‌స్టాగ్రాంలో ఆసక్తికర పోస్ట్ చేశారు. నిన్నటి తేదీని ఉద్దేశించి ‘రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్’ అని రాసుకొచ్చారు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని అమృత తండ్రి మారుతీరావు 2018లో సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ను హత్య చేయించాడు.

Similar News

News April 18, 2026

ఏపీలో ప్రతిపక్షమేది?

image

ఏపీలో ఉన్న మూడు పెద్ద ప్రాంతీయ పార్టీలు టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు పెట్టుకోగా.. జగన్ పొత్తు లేకపోయినా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ BJPకి వ్యతిరేకంగా ఉన్నా దానికి పెద్దగా ప్రజల మద్దతు దక్కడం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో సౌత్ రాష్ట్రాలన్నీ ఒక దారిలో ఉంటే ఏపీది మరో దారి. మరి ఏపీలో ప్రతిపక్షమేది?

News April 18, 2026

డీలిమిటేషన్.. జాతీయ మీడియాలో రేవంత్ పేరు!

image

131వ రాజ్యాంగ సవరణ, డీలిమిటేషన్ బిల్లుల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో మిగతా సీఎంల కంటే ముందుగా రేవంతే ఈ అంశాన్ని లేవనెత్తారు. వరుసగా ప్రెస్ మీట్లు పెడుతూ డీలిమిటేషన్ వల్ల సౌత్ స్టేట్స్‌కు అన్యాయం జరుగుతుందని కేంద్రాన్ని విమర్శించారు. హైబ్రిడ్ మోడల్‌లో డీలిమిటేషన్ జరగాలని సరికొత్త పాయింట్‌ను తెరపైకి తెచ్చారు.

News April 18, 2026

పూరీ జగన్నాథ్ ‘స్లమ్ డాగ్’కు ఓటీటీ కష్టాలు?

image

వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కొత్త చిత్రం ‘స్లమ్ డాగ్’పై ఆశలు పెట్టుకున్నారు. విజయ్ సేతుపతి లీడ్ రోల్ చేసిన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే ముగిసినా రిలీజ్‌ ప్రకటన వెలువడటం లేదు. దీనికి ఓటీటీ డీల్ క్లోజ్ కాకపోవడమే కారణమని సమాచారం. ప్రస్తుతం పలు ఓటీటీ సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. డీల్ పూర్తయ్యాకే విడుదల ప్రకటన వచ్చే అవకాశం ఉంది.