News March 11, 2025
18 సీజన్లు.. ఒక్కడే కింగ్: RCB

విరాట్ కోహ్లీని 2008లో సరిగ్గా ఇదే రోజున IPL ఆక్షన్‌లో కొనుగోలు చేసినట్లు RCB ట్వీట్ చేసింది. ‘U19 ప్లేయర్ డ్రాఫ్ట్ నుంచి ఈ టాలెంటెడ్ బాయ్‌ను తీసుకున్నాం. 18yrs తర్వాత కూడా ఈ గేమ్‌కు అతడే కింగ్. ఇది చాలా గొప్ప ప్రయాణం. థాంక్యూ విరాట్. 18 సీజన్లు, 1 టీమ్, 1 కాన్స్టాంట్ కింగ్’ అని ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని RCB ఈసారైనా ఛాంపియన్‌గా నిలుస్తుందేమో చూడాలి.
Similar News
News March 12, 2025
స్టార్‌లింక్ ఇంటర్నెట్: నిన్న ఎయిర్టెల్ నేడు జియో

భారత టెలికం పరిశ్రమలో మరో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దేశంలో స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నామని రిలయన్స్ జియో ప్రకటించింది. స్టార్‌లింక్ ఒప్పందంపై <<15725079>>ఎయిర్టెల్<<>> ప్రకటన విడుదల చేసిన మరునాడే జియో ఇలా చేయడం గమనార్హం. తమ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ పరికరాలు విక్రయిస్తామని, యాక్టివేషన్, ఇన్స్టలేషన్ సేవలు అందిస్తామని తెలిపింది.
News March 12, 2025
సౌందర్య మృతి.. మోహన్‌బాబుపై సంచలన ఆరోపణలు

అలనాటి అందాల తార సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత ఆమెను హత్య చేశారంటూ ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘శంషాబాద్‌లోని జల్పల్లిలో ఆరెకరాల భూమిని విక్రయించేందుకు సౌందర్య, ఆమె సోదరుడు నిరాకరించడం పెద్ద వివాదమైంది. ఇదే హత్యకు దారి తీసింది. సౌందర్య హెలికాప్టర్ ప్రమాదం తర్వాత మోహన్‌బాబు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు’ అని ఆయన తెలిపారు.
News March 12, 2025
శాసనమండలిలో వైసీపీ నిరసన

AP: నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్లపై వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించడంతో ఆ పార్టీ సభ్యులు మండలిలో నిరసనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అంటూ విమర్శలు చేశారు. పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు ఆందోళన చేయడంతో మండలిని స్పీకర్ వాయిదా వేశారు.