News March 11, 2025
‘ఆడుదాం ఆంధ్ర’పై ACB విచారణకు ఆదేశం

AP: ‘ఆడుదాం ఆంధ్ర’పై ACB విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’లో అవకతవకలు ఉన్నాయనే ఆరోపణలపై నిన్న అసెంబ్లీలో చర్చ జరిగింది. ప్రభుత్వం కేటాయించినవే కాకుండా జిల్లాల్లోని నిధులూ వినియోగించినట్లు పలువురు సభ్యులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ACB విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో క్రీడాశాఖ మంత్రిగా RK రోజా బాధ్యతలు నిర్వర్తించారు.
Similar News
News November 4, 2025
రేపు కార్తీక పౌర్ణమి.. ఇలా చేస్తే?

ఇవాళ రా.10.30 నుంచి రేపు సా.6.48 వరకు పౌర్ణమి తిథి ప్రభావం ఉంటుందని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం నుంచి సాయంత్రం వరకు తిథి ప్రభావం ఎక్కువగా ఉండటంతో రేపు వ్రతం చేసుకోవాలని సూచిస్తున్నారు. రేపు ఉ.4:52-5.44 వరకు నదీ స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించాలి. సా.5.15-7.05 వరకు దీపారాధాన చేసేందుకు మంచి సమయమని చెబుతున్నారు. ఈ రోజున 365 వత్తులతో దీపారాధన చేస్తే దోషాన్ని నివారించవచ్చని సూచిస్తున్నారు.
News November 4, 2025
మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వరా: KTR

నిన్న మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వ్యాన్‌లో తరలించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. ‘మరణంలోనూ కనీస గౌరవం లేకపోవడం బాధాకరం. రాష్ట్రంలో అంబులెన్స్‌లు / మార్చురీ వ్యాన్‌లు లేవా? చనిపోయిన వారికి & వారి కుటుంబాలకు కనీస గౌరవం ఇవ్వకుండా అమానవీయంగా ప్రవర్తించారు. తోపుడు బండ్లు, ట్రాక్టర్లు, చెత్త వ్యాన్లు, టోయింగ్ వాహనాలపై ఇలా తీసుకెళ్లడం ఏంటి’ అంటూ X వేదికగా మండిపడ్డారు.
News November 4, 2025
మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.


