News March 12, 2025

ఇండియాకు రూ.20.80 కోట్లు.. పాక్‌కి ఎంతంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు ICC రూ.20.80 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చింది. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.10.40 కోట్లు చెల్లించింది. కాగా, సెమీస్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా& సౌతాఫ్రికా జట్లకు రూ.5.20కోట్లు, 5, 6 స్థానాల్లో నిలిచిన అఫ్గాన్ & బంగ్లాదేశ్‌లకు రూ.3 కోట్లు, ఇక చివరి రెండు స్థానాల్లో ఉన్న పాకిస్థాన్ & ఇంగ్లండ్ టీమ్స్‌కు రూ.1.20 కోట్లు అందించింది.

Similar News

News November 6, 2025

నేడు నాలుగో టీ20.. గెలుపుపై ఇరు జట్ల కన్ను!

image

భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ మ.1.45 గంటలకు 4వ T20 జరగనుంది. ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచుల్లో తొలి T20 రద్దు కాగా చెరొకటి గెలిచాయి. నేటి మ్యాచులో గెలిచి సిరీస్‌లో ముందంజ వేయాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి. గత మ్యాచులో గెలవడం భారత్‌కు కాస్త సానుకూలాంశం. బౌలింగ్‌లో స్టార్ బౌలర్ బుమ్రా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్‌లో గిల్, సూర్య, తిలక్ భారీ స్కోర్లు చేస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచవచ్చు.

News November 6, 2025

వేదాల్లో ఏముంటాయి? వాటినెందుకు చదవాలి?

image

సంతోషం కోసం వేదాలు చదవాలి. ఇందులో ప్రధానంగా 4 విషయాలు ఉన్నాయి.
1. ఐహిక సుఖాలను, ఆనందాలను పొందేందుకు ఉపాయాలు.
2. దేవతల అనుగ్రహం కోసం పాటించవలసిన వివిధ ఉపాసనలు, పద్ధతులు.
3. జీవిత అంతిమ లక్ష్యమైన మోక్షాన్ని సాధించడానికి మార్గదర్శకమైన వచనాలు.
4. నేటి ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాలకు మూలాలైన అనేక ప్రాథమిక సూత్రాలు. <<-se>>#VedikVibes<<>>

News November 6, 2025

నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన‍!

image

నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతోందని APSDMA పేర్కొంది. ఇవాళ కృష్ణా, ప్రకాశం, NLR, ATP, కడప, చిత్తూరు, TPT జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అటు TGలో ఉ.8.30 గంటల వరకు ఆదిలాబాద్, నిర్మల్, మహబూబ్‌నగర్, నారాయణ్‌పేట్, నల్గొండ, నిజామాబాద్, వనపర్తి, గద్వాల, RR, HYD, మల్కాజ్‌గిరి, వికారాబాద్ ప్రాంతాల్లో వర్షం కురిసే ఛాన్సుందని HYD IMD తెలిపింది.