News March 12, 2025

ఇండియాకు రూ.20.80 కోట్లు.. పాక్‌కి ఎంతంటే?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు ICC రూ.20.80 కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చింది. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు రూ.10.40 కోట్లు చెల్లించింది. కాగా, సెమీస్‌లో ఓడిపోయిన ఆస్ట్రేలియా& సౌతాఫ్రికా జట్లకు రూ.5.20కోట్లు, 5, 6 స్థానాల్లో నిలిచిన అఫ్గాన్ & బంగ్లాదేశ్‌లకు రూ.3 కోట్లు, ఇక చివరి రెండు స్థానాల్లో ఉన్న పాకిస్థాన్ & ఇంగ్లండ్ టీమ్స్‌కు రూ.1.20 కోట్లు అందించింది.

Similar News

News April 11, 2026

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే..

image

వేసవిలో అలోవెరా జ్యూస్ తాగితే శరీరానికి చలువ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ‘ఇది శరీర వేడిని తగ్గించి హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. పరగడుపున తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది. షుగర్ కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది’ అని అంటున్నారు. ‘రోజుకు 50-120ml మాత్రమే తీసుకోవాలి. జెల్‌ను నీటితో కడిగి మిక్సీలో వేసి నీరు, నిమ్మరసం/తేనె కలుపుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News April 11, 2026

350 బ్యాంక్ ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

ఇండియన్ బ్యాంక్ 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఐటీ, ఫైనాన్స్, మార్కెటింగ్, క్రెడిట్, రిస్క్, HRలో అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మేనేజర్ లాంటి ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్‌తో భర్తీ చేయనున్నారు. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ ఏప్రిల్ 28. బీటెక్, MCA, MBA, CA, ఏదైనా పీజీ చేసి ఉండాలి. మరిన్ని వివరాలకు https://indianbank.bank.in/career/ చూడండి.

News April 11, 2026

ChatGPT సృష్టికర్త ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోల్ బాంబు దాడి

image

చాట్‌జీపీటీని క్రియేట్ చేసిన OpenAI CEO సామ్ ఆల్ట్‌మన్ ఇంటిపై పెట్రోల్ బాంబుతో దాడి జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ యువకుడు ఆయన నివాసంపై దాడి చేసి ఆఫీసును తగులబెడతానని బెదిరించాడు. పోలీసులు నిందితుణ్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. తన ఫ్యామిలీ సేఫ్టీపై ఆందోళన వ్యక్తం చేసిన ఆల్ట్‌మన్ AI పట్ల పెరుగుతున్న వ్యతిరేకత, తనపై వస్తున్న విమర్శలే ఈ దాడులకు కారణమని ఆవేదన వ్యక్తం చేశారు.