News March 12, 2025
ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు

AP: ఈ నెల 15న పశ్చిమగోదావరిలోని తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన షెడ్యూల్ ఇవాళ లేదా రేపు ఖరారు కానుంది.
Similar News
News March 12, 2025
APPLY NOW.. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ

AP: 13 జిల్లాలకు చెందిన అభ్యర్థుల నుంచి అగ్నివీర్‌ల నియామకం కోసం ఇండియన్ ఆర్మీ <
News March 12, 2025
బాబూ.. నీకిదే తొలి హెచ్చరిక: జగన్

AP: వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘యువత పోరు’ను పోలీసుల ద్వారా అణగదొక్కడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి చంద్రబాబుకు ఇదే తొలి హెచ్చరిక అన్నారు. ‘విద్యార్థుల కోసం మా ప్రభుత్వం విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, అమ్మఒడి పథకాలు ఇచ్చింది. కానీ చంద్రబాబు తన పాలనతో మళ్లీ చీకటి రోజులు తెస్తున్నారు’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.
News March 12, 2025
BIG BREAKING: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

HYDకు చెందిన లెజెండరీ భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) USలో కన్నుమూశారు. 1967-1975 వరకు భారత జట్టుకు విశిష్ట సేవలు అందించిన ఆయన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మీడియం పేసర్. 1971లో ఒవెల్ టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన జట్టులో సభ్యుడు. కెరీర్‌లో 29 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఆయన 47 వికెట్లు పడగొట్టారు. 1959-79లో HYD రంజీ జట్టు, ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికై పటౌడీ కెప్టెన్సీలో AUSపై తొలి టెస్ట్ ఆడారు.