News March 12, 2025
ఈ నెల 15న తణుకుకు సీఎం చంద్రబాబు

AP: ఈ నెల 15న పశ్చిమగోదావరిలోని తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించే ప్రజావేదికలో ప్రసంగిస్తారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రదర్శనను ఆయన ప్రారంభిస్తారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ ఏర్పాట్లను సమీక్షించారు. పర్యటన షెడ్యూల్ ఇవాళ లేదా రేపు ఖరారు కానుంది.
Similar News
News March 17, 2025
చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం

చంద్రుడిపై పరిశోధనలు చేపట్టే చంద్రయాన్-5 ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. చంద్రయాన్-2లో 25 KGల బరువు ఉన్న రోవర్ ‘ప్రజ్ఞాన్’ను జాబిల్లిపైకి తీసుకెళ్లగా, చంద్రయాన్-5లో 250 కేజీల రోవర్‌ను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఈ ప్రయోగాన్ని జపాన్ సాయంతో నిర్వహిస్తామన్నారు. ఇక జాబిల్లిపై ఉన్న మట్టి నమూనాలను తీసుకొచ్చేందుకు 2027లో చంద్రయాన్-4 మిషన్‌ను ప్రయోగిస్తామని చెప్పారు.
News March 17, 2025
మీ పిల్లలు ఎక్కువగా చాక్లెట్లు తింటున్నారా?

చాక్లెట్ల నుంచి పిల్లలను వేరు చేయలేం. వాటిని సాధించేదాక వాళ్లు చేసే అల్లరి అంతాఇంతా కాదు. అలా అని ఒకటితో సరిపెట్టరు. ఇలా ఎక్కువగా చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చిపోవడంతో పాటు వాటికి రంధ్రాలు ఏర్పడే ఆస్కారం ఉంది. అలాగని వాటిని తినకుండా ఉంచలేం. కాబట్టి రాత్రి పడుకునే ముందు వారితో బ్రష్ చేయిస్తే పళ్ల మధ్య అతుక్కుపోయిన చాక్లెట్ బయటికి వస్తుంది. దీంతో 10 గంటల వరకూ పళ్లకు రక్షణ కలుగుతుంది.
News March 17, 2025
నేడు అసెంబ్లీలోకి చరిత్రాత్మక బిల్లులు

నేడు అసెంబ్లీలో రెండు చరిత్రాత్మక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. SCవర్గీకరణకు చట్టబద్ధతతో పాటు BCలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు శాసనసభ ముందుకు రానుంది. వీటిపై సభలో నేడు, రేపు ప్రత్యేక చర్చ జరగనుంది. ఎస్సీ వర్గీకరణకు షమీమ్ అక్తర్ ఆధ్వర్యంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది. కులగణన సర్వే ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ప్రకటించింది. ప్రస్తుతం BCలకు 29శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.