News March 12, 2025

APPLY: అకౌంట్లలోకి రూ.6,000

image

రైతులకు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ గుడ్‌న్యూస్ చెప్పారు. ప్రధాన మంత్రి కిసాన్ పథకంలో ఇప్పుడు చేరినా పెట్టుబడి సాయం అందిస్తామని తెలిపారు. అర్హులైన అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేంద్రం ఏటా రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.6వేలు మూడు విడతల్లో అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పెట్టుబడి సాయంగా తొలి విడత నిధులను ప్రధాని మోదీ FEB 24న విడుదల చేశారు.
వెబ్‌సైట్: <>pmkisan.gov.in<<>>

Similar News

News March 12, 2025

బాబూ.. నీకిదే తొలి హెచ్చరిక: జగన్

image

AP: వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘యువత పోరు’ను పోలీసుల ద్వారా అణగదొక్కడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి చంద్రబాబుకు ఇదే తొలి హెచ్చరిక అన్నారు. ‘విద్యార్థుల కోసం మా ప్రభుత్వం విద్యాదీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, అమ్మఒడి పథకాలు ఇచ్చింది. కానీ చంద్రబాబు తన పాలనతో మళ్లీ చీకటి రోజులు తెస్తున్నారు’ అంటూ ఆయన ఫైర్ అయ్యారు.

News March 12, 2025

BIG BREAKING: దిగ్గజ క్రికెటర్ కన్నుమూత

image

HYDకు చెందిన లెజెండరీ భారత మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ(83) USలో కన్నుమూశారు. 1967-1975 వరకు భారత జట్టుకు విశిష్ట సేవలు అందించిన ఆయన లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్, మీడియం పేసర్. 1971లో ఒవెల్ టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన జట్టులో సభ్యుడు. కెరీర్‌లో 29 టెస్టు మ్యాచ్‌లు ఆడి ఆయన 47 వికెట్లు పడగొట్టారు. 1959-79లో HYD రంజీ జట్టు, ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికై పటౌడీ కెప్టెన్సీలో AUSపై తొలి టెస్ట్ ఆడారు.

News March 12, 2025

త్వరలో ఆల్ పార్టీ మీటింగ్: భట్టి

image

TG: దేశంలో త్వరలోనే నియోజకవర్గాల పునర్విభజన జరగనుండగా, దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో పాల్గొనాలని అన్ని పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి లేఖలు రాశారు. త్వరలోనే అఖిలపక్ష భేటీ తేదీ, వేదిక ప్రకటిస్తామని పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఈ సమావేశంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

error: Content is protected !!