News March 23, 2024
కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ ప్రకటన.. మండిపడ్డ కేంద్రం

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పారదర్శక విచారణ చేపట్టాలన్న జర్మన్ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీలోని జర్మనీ రాయబారిని పిలిపించిన విదేశాంగ శాఖ.. తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏంటని నిలదీసింది. దోషిగా తేలే వరకు నిందితుడిని నిర్దోషిగానే పరిగణించాలనేది చట్టంలోని ప్రాథమిక అంశమని, కేజ్రీవాల్‌కూ ఇది వర్తిస్తుందని జర్మనీ పేర్కొనడం దుమారం రేపింది.
Similar News
News July 10, 2025
రెండు రోజులు వైన్స్ బంద్

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 13, 14 తేదీల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News July 10, 2025
లంచ్ బ్రేక్ సమయానికి ENG స్కోర్ ఎంతంటే?

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ENG 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్‌లను నితీశ్ కుమార్ పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పోప్(12*), రూట్(24*) ఉన్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తొలి వికెట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.
News July 10, 2025
అకౌంట్లలోకి రూ.13,000.. చెక్ చేసుకోండిలా!

AP: ‘తల్లికి వందనం’ 2వ విడత డబ్బులను ప్రభుత్వం ఇవాళ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. తొలి విడతలో పలు కారణాలతో ఆగిపోయిన, ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్, కేంద్రీయ విద్యాలయాలు, CBSE, నవోదయ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13వేల చొప్పున వేస్తోంది. నగదు స్టేటస్ కోసం వాట్సాప్ మనమిత్ర నంబర్ 95523 00009కు ‘Hi’ అని మెసేజ్ చేయాలి. అందులో తల్లికి వందనం ఆప్షన్ ఎంచుకొని, ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే వివరాలు వస్తాయి.