News March 12, 2025

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా

image

TG: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం అనంతరం తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. అంతకుముందు గవర్నర్ మాట్లాడుతూ ‘260 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తితో తెలంగాణ రికార్డు సృష్టించింది. రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం’ అని తెలిపారు.

Similar News

News March 12, 2025

నిలిచిన లావాదేవీలు.. స్పందించిన SBI

image

తమ బ్యాంక్ లావాదేవీలు ఫెయిల్ కావడంపై దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ SBI స్పందించింది. ‘SBI యూపీఐ లావాదేవీల్లో సాంకేతిక సమస్య ఎదురైంది. దీని కారణంగా కస్టమర్ల లావాదేవీలు ఫెయిల్ అవుతున్నాయి. దీన్ని సరిచేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఖాతాదారులు UPI లైట్ లావాదేవీలు వినియోగించుకోవచ్చు’ అని వెల్లడించింది. అటు తమ లావాదేవీలూ ఫెయిల్ అయ్యాయని, డబ్బులు కట్ అయ్యి ప్రాసెసింగ్‌లో పడ్డాయని యూజర్లు పోస్టులు పెడుతున్నారు.

News March 12, 2025

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా రిటైర్మెంట్

image

బంగ్లాదేశ్ క్రికెటర్ మహ్మదుల్లా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 39 ఏళ్ల మహ్మదుల్లా 2021లో టెస్టులు, 2024లో టీ20లకు గుడ్ బై పలికారు. ఇప్పుడు వన్డేల నుంచి తప్పుకున్నారు. బంగ్లా తరఫున మహ్మదుల్లా 50 టెస్టులు, 239 వన్డేలు, 141 టీ20లు ఆడారు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,047 పరుగులు చేశారు. 2007లో శ్రీలంకపై తన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.

News March 12, 2025

కేఎల్ రాహుల్-అతియా ఫొటోలు వైరల్

image

టీమ్ ఇండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అతి త్వరలో తండ్రి కాబోతున్నారు. వచ్చే నెలలో తమ తొలి సంతానానికి ఆయన భార్య అతియా శెట్టి జన్మనివ్వబోతున్నారు. తన భార్య ఒడిలో సేదతీరుతూ ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారాయి. ఈ పిక్స్ చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రాహుల్, అతియా 2023 జనవరిలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!