News March 12, 2025
కట్టెల పొయ్యితో మా అమ్మ పడిన కష్టాలు తెలుసు: చంద్రబాబు

AP: ఆడబిడ్డలు సైకిళ్లు తొక్కలేరనే భావన చెరిపేసేందుకు గతంలో విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చినట్లు CM చంద్రబాబు అన్నారు. ‘మగవాళ్ల కంటే ఆడవాళ్లు తెలివైనవాళ్లు. RTCలో మహిళా కండక్టర్లు బాగా రాణిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ఆస్తులను మహిళల పేరుతోనే ఇస్తున్నాం. కట్టెల పొయ్యి వద్ద మా అమ్మ పడిన కష్టాలు నాకు తెలుసు. ఆ కష్టాలు తీరుస్తూ దీపం పథకం కింద 65లక్షల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం’ అని అసెంబ్లీలో అన్నారు.
Similar News
News March 13, 2025
ODI WC-2027: రోహిత్ కీలక నిర్ణయం?

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ వరకూ ఆడేందుకు ఫిట్‌నెస్, ఫోకస్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇందుకు భారత అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్‌తో కలిసి ఆయన పని చేస్తారని టాక్. అభిషేక్ నుంచి బ్యాటింగ్, ఫిట్‌నెస్ టిప్స్ తీసుకుంటారని తెలుస్తోంది. కాగా IPLలో దినేశ్ కార్తీక్‌కు అభిషేక్ మెంటార్‌గా ఉన్నారు. ఆ సమయంలో DK చెలరేగి ఆడిన విషయం తెలిసిందే.
News March 12, 2025
NEP అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవు: స్టాలిన్

NEP అమలుతో దేశమంతా హిందీ భాషను అభివృద్ధి చేయాలని బీజేపీ భావిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. దీంతో స్థానిక భాషల గుర్తింపు తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఈ విద్యావిధానం అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవన్నారు. డీలిమిటేషన్‌తో ఉత్తర భారతంలో ఎంపీల సంఖ్య పెంచి అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని DMK దీనిని అడ్డుకుంటుందని తెలిపారు.
News March 12, 2025
పకడ్బందీగా పదో తరగతి పరీక్షలు

AP: రాష్ట్రంలో ఈ నెల 17 నుంచి 31 వరకు జరిగే పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. 3,450 సెంటర్లలో 6,19,275 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. 156 ఫ్లైయింగ్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ పర్యవేక్షిస్తారు. సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. జిరాక్స్, నెట్ సెంటర్లను మూసివేస్తారు. హాల్లోకి చీఫ్ సూపరింటెండెంట్ తప్ప ఎవరూ మొబైల్ తీసుకెళ్లకూడదు. కంట్రోల్ రూమ్ నం. 08662974540.