News March 12, 2025

NEP అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవు: స్టాలిన్

image

NEP అమలుతో దేశమంతా హిందీ భాషను అభివృద్ధి చేయాలని బీజేపీ భావిస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శించారు. దీంతో స్థానిక భాషల గుర్తింపు తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ఈ విద్యావిధానం అమలు చేస్తే రిజర్వేషన్లు ఉండవన్నారు. డీలిమిటేషన్‌తో ఉత్తర భారతంలో ఎంపీల సంఖ్య పెంచి అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ భావిస్తుందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విఘాతమని DMK దీనిని అడ్డుకుంటుందని తెలిపారు.

Similar News

News April 16, 2026

రాబోయే 2 గంటల్లో వర్షం

image

TG: వచ్చే 2 గంటల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. వికారాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ వర్షాల వల్ల ఉక్కపోత, వేడి మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

News April 16, 2026

మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

image

మహిళలకు వచ్చే క్యాన్సర్‌ వ్యాధుల్లో సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్‌. వీటితోపాటు యూట్రస్‌ క్యాన్సర్‌, అండాశయ (ఓవేరియన్‌) క్యాన్సర్‌ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్‌, ఓవేరియన్‌ క్యాన్సర్‌ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

News April 16, 2026

దక్షిణాదికి అన్యాయం జరగదు: మోదీ

image

డీలిమిటేషన్‌తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని.. తమకు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలనే భేదం లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆలస్యం కావడానికి వీల్లేదని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయకపోతే మహిళలకు అన్యాయం చేసినట్టేనని అన్నారు. రాజకీయాల్లో తమ శక్తి చూపించడానికి మహిళలు సిద్ధంగా ఉన్నారని.. వారికి అవకాశం ఇవ్వాలని తెలిపారు.