News March 23, 2024

కవిత ఆడపడుచు ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు

image

TG: ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. మాదాపూర్‌లోని కవిత బంధువుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 11 గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మేనల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీస్తున్నారు.

Similar News

News July 10, 2025

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

image

బంగారం ధరల్లో కొద్దిరోజులుగా హెచ్చుతగ్గులు కన్పిస్తున్నాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై ₹220 పెరిగి ₹98,400కు చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹90,200 పలుకుతోంది. అటు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. కేజీ రేట్ రూ.1,20,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News July 10, 2025

రెండు రోజులు వైన్స్ బంద్

image

ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా హైదరాబాద్‌లో ఈనెల 13, 14 తేదీల్లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు సెంట్రల్, ఈస్ట్, నార్త్ హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలకు ఈ నిబంధన వర్తిస్తుందని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 10, 2025

లంచ్ బ్రేక్ సమయానికి ENG స్కోర్ ఎంతంటే?

image

లార్డ్స్‌లో భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో లంచ్ బ్రేక్ సమయానికి ENG 2 వికెట్లు కోల్పోయి 83 పరుగులు చేసింది. ఓపెనర్లు క్రాలే, డకెట్‌లను నితీశ్ కుమార్ పెవిలియన్‌కు పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం క్రీజులో పోప్(12*), రూట్(24*) ఉన్నారు. బుమ్రా, ఆకాశ్ దీప్, సిరాజ్ తొలి వికెట్ కోసం వేట కొనసాగిస్తున్నారు.