News March 23, 2024
కవిత ఆడపడుచు ఇంట్లో ముగిసిన ఈడీ సోదాలు
TG: ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. మాదాపూర్‌లోని కవిత బంధువుల ఇళ్లలో ఇవాళ ఉదయం నుంచి ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 11 గంటలపాటు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత మేనల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీస్తున్నారు.
Similar News
News September 11, 2024
టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం: సీఎం రేవంత్
TG: టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. ట్రైనీ ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మరో 35 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. తెలంగాణ పునర్నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
News September 11, 2024
కేసీఆర్ కల సాకారమైంది: హరీశ్ రావు
TG: కేసీఆర్ మంజూరు చేసిన మరో 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావడం సంతోషకరమని హరీశ్ రావు అన్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్ కల సాకారమైందని, దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 850 ప్రభుత్వ మెడికల్ సీట్లు మాత్రమే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 4,090కి చేరిందని వివరించారు.
News September 11, 2024
స్టార్ హీరో విడాకులు.. భార్య షాకింగ్ కామెంట్స్
తమిళ హీరో జయం రవి <<14058198>>విడాకులు<<>> తీసుకున్నట్లు ప్రకటించడంపై ఆయన భార్య ఆర్తి రవి విచారం వ్యక్తం చేశారు. తన ప్రమేయం లేకుండానే ఈ ప్రకటన చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ విషయమై తన భర్తతో మాట్లాడుదామని అనుకున్నా అవకాశం లేకపోయిందని వాపోయారు. తన వ్యక్తిత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ క్లిష్ట సమయంలో పిల్లల సంరక్షణపై దృష్టి పెడుతానని చెప్పారు.