News March 12, 2025

చనిపోయిందనుకొని ఖననం చేస్తే.. చివరికి.!

image

మరణించిందని భావించి పూడ్చిపెట్టిన మహిళ తిరిగి లేచిన ఘటన USలో జరిగింది. 1915లో ఎస్సీ విలియమ్స్ మూర్ఛ వ్యాధితో చనిపోయిందనుకొని అంత్యక్రియలు కూడా పూర్తిచేశారు. అయితే, అంత్యక్రియలకు ఆలస్యంగా వచ్చిన తన సోదరి చివరి చూపు చూస్తానని శవపేటికను తెరవాలని కోరారు. దీంతో తవ్వి పేటిక తెరవగా ఆమె లేచి కూర్చొని నవ్వుతూ కనిపించారు. అది చూసిన వారంతా భయంతో పారిపోయారు. ఆ తర్వాత ఆమె మరో 47ఏళ్లు జీవించడం గమనార్హం.

Similar News

News March 13, 2025

బీటెక్ విద్యార్థులకు షాక్!

image

TG: రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు పెరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ అడ్మిషన్స్, ఫీజు రెగ్యులేషన్ కమిషన్ (TAFRC) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. సీబీఐటీ, VNR, వాసవి, MGIT లాంటి కొన్ని కాలేజీల్లో 50% వరకు పెంపును ప్రతిపాదించింది. CBITలో ఫీజు రూ.1.65 లక్షలు ఉండగా ఏకంగా రూ.2.40 లక్షలకు పెరగనుంది. కాలేజీల నిర్వహణ, ప్రొఫెసర్ల జీతాలు, సదుపాయాలను పరిశీలించి TAFRC ఫీజుల పెంపును ప్రతిపాదిస్తుంది.

News March 13, 2025

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు

image

TG: కోడి పందాల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు రావాలని పేర్కొన్నారు. మొయినాబాద్‌లోని ఫామ్ హౌస్‌లో కోడి పందాలు నిర్వహించారని ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే తనకు కోడి పందాలతో సంబంధం లేదని, వేరే వ్యక్తికి ఫామ్ హౌస్‌ను లీజుకు ఇచ్చినట్లు ఆయన గత నెలలో పోలీసులకు వివరణ ఇచ్చారు.

News March 13, 2025

ఆధార్, మొబైల్ నంబర్‌తో ఓటరు కార్డు లింక్ అవ్వాలి: ఈసీఐ

image

ఓటర్ ఐడీ కార్డుల్ని ఆయా ఓటర్ల ఆధార్, మొబైల్ నెంబర్లతో అనుసంధానించాలని ఈసీ అన్ని రాష్ట్రాల సీఈఓలను ఆదేశించింది. దీంతో పాటు జనన, మరణాల వివరాల ఆధారంగా ఓటర్ లిస్టును ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తుండాలని ఆదేశించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఓటరు నమోదుకు ఆధార్ లింక్ కంపల్సరీ కాదని 2022లో సుప్రీం కోర్టు తీర్పునివ్వగా ఈసీఐ తాజా ఆదేశాలు అందుకు భిన్నంగా ఉండటం గమనార్హం.

error: Content is protected !!