News March 12, 2025
నిలిచిన SBI లావాదేవీలు.. కస్టమర్ల అసహనం

దేశ వ్యాప్తంగా SBI ఆన్‌లైన్ సేవలు బంద్ అయ్యాయి. UPI యాప్‌లో SBI అకౌంట్ నుంచి చేస్తున్న లావాదేవీలు నిలిచిపోయాయి. అలాగే SBI అకౌంట్ ఉన్న వారికి చేస్తున్న లావాదేవీలు సైతం ఫెయిల్ అవుతున్నాయి. నిన్న కూడా ఇలాంటి సమస్యే తలెత్తి యూజర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా మళ్లీ అదే తరహా సమస్య రావడంతో దేశంలో అతిపెద్ద బ్యాంక్‌పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీకూ ఇలాంటి సమస్యే ఎదురైందా? కామెంట్ చేయండి.
Similar News
News March 13, 2025
వాకింగ్ సమయంలో కుక్కల దాడి నుంచి తప్పించుకోండిలా!

వీధికుక్కల దాడి నుంచి సురక్షితంగా ఉండటానికి ఇలా చేయడం మంచిది. వీధి కుక్కలు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో వాకింగ్ చేయకండి. కుక్కలు లేవని నిర్ధారించుకున్నాకే ఒంటరిగా వాకింగ్ చేయడం ఉత్తమం. తోటి వాకర్స్‌తో రన్నింగ్/వాకింగ్ చేయడం మంచిది. కుక్కలు మీ పళ్లను/ నవ్వును చూసినట్లయితే ఆందోళనకు గురై దాడి చేయొచ్చు. వీధి కుక్కలకు ఒకవేళ ఆహారం పెడితే రెగ్యులర్‌గా పెట్టాలి. లేదంటే అవి మీకు ముప్పు కలిగించవచ్చు.
News March 13, 2025
ఎవరు తలుపు కొడతారోనని భయపడేదాన్ని: హీరోయిన్

ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సేఫ్టీ విషయంలో చాలా కష్టపడ్డానని బాలీవుడ్ నటి దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడు ఎవరు తలుపు కొడతారోనని భయంతో మేకప్ ఆర్టిస్ట్‌ను ఎప్పుడూ సాయంగా ఉంచుకునేదాన్ని. ఇతర హీరోయిన్ల తలుపులు చాలామంది కొట్టి ఉంటారు. నేను అప్పటికే అందాల పోటీ గెలవడం వల్ల, ఫేమస్ కావడంతో అంత త్వరగా ఎవరూ మిస్‌బిహేవ్ చేయలేదు’ అని పేర్కొన్నారు.
News March 13, 2025
శాసన సభ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే: హరీశ్ రావు

TG: ఢిల్లీలో ఉన్నCM రేవంత్ మేరకే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అన్నారు. స్పీకర్‌పై ఏకవచనం వాడలేదని ఒకవేళ వాడి ఉంటే శాసనసభ నియమాల పుస్తకంలో ఏకవచనం వాడటం తప్పుగా చెప్పలేదన్నారు. దళిత కార్డును అడ్డం పెట్టుకొని ప్రభుత్వం రాజకీయం చేస్తుందని …దళిత రాష్ట్రపతి ద్రౌపదీముర్ముని అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆరోపించారు.