News March 13, 2025
శాసన సభ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే: హరీశ్ రావు

TG: ఢిల్లీలో ఉన్నCM రేవంత్ మేరకే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్ డే అన్నారు. స్పీకర్‌పై ఏకవచనం వాడలేదని ఒకవేళ వాడి ఉంటే శాసనసభ నియమాల పుస్తకంలో ఏకవచనం వాడటం తప్పుగా చెప్పలేదన్నారు. దళిత కార్డును అడ్డం పెట్టుకొని ప్రభుత్వం రాజకీయం చేస్తుందని …దళిత రాష్ట్రపతి ద్రౌపదీముర్ముని అవమానించిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆరోపించారు.
Similar News
News March 26, 2025
కొడాలి నానికి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

AP: మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యపరీక్షల సమయంలో గుండెలోనూ సమస్య ఉందని డాక్టర్లు గుర్తించారు. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
(Article being continuously updated..)
News March 26, 2025
జిన్‌పింగ్ కుటుంబీకుల వద్ద భారీగా అవినీతి ఆస్తులు!

దేశంలో అవినీతిని వేటాడుతున్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ చెబుతుంటారు. కానీ వారి కుటుంబమే రూ.కోటానుకోట్లు వెనకేసిందని రేడియో ఫ్రీ ఏషియా నివేదిక తెలిపింది. ‘2012లో అధికారంలోకి వచ్చిన తర్వాతి నుంచి జిన్‌పింగ్ అవినీతి నిరోధక ప్రచారాన్ని ప్రారంభించారు. పార్టీలోని వేలాదిమందిని అరెస్ట్ చేశారు. అయితే తమకున్న ప్రభుత్వ, ప్రైవేటు మార్గాల్లో జిన్‌పింగ్ కుటుంబం భారీగా కూడబెట్టింది’ అని వెల్లడించింది.
News March 26, 2025
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ ఉంది. ఇక శ్రీవారిని నిన్న 64,252మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 25,943మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.68 కోట్ల ఆదాయం లభించిందని టీటీడీ అధికారులు తెలిపారు.