News March 13, 2025
‘జన్మభూమి’ ఇక సికింద్రాబాద్‌లో ఆగదు! వివరాలివే

విశాఖ-లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వచ్చే నెల 25 నుంచి సికింద్రాబాద్‌లో ఆగదు. దాని ప్రయాణమార్గాన్ని మళ్లిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ ప్రకటించింది. శాశ్వత ప్రాతిపదికన లింగంపల్లి నుంచి చర్లపల్లి-అమ్ముగూడ-సనత్ నగర్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్లవైపు వెళ్లదని, ప్రయాణికులు గుర్తుంచుకోవాలని కోరింది.
Similar News
News March 14, 2025
GROUP-1 రిజల్ట్.. టీజీపీఎస్సీ కీలక సూచన

TG: గ్రూప్-1 ఫలితాల్లో టాప్-500లో 45.6% మంది బీసీలే ఉన్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఓసీలు 36.4%, ఎస్సీలు 10%, ఎస్టీలు 7.6% ఉన్నట్లు వెల్లడించింది. ఫలితాలపై తప్పుడు ప్రచారం నమ్మొద్దని సూచించింది. మెరిట్ ప్రకారం, పారదర్శకంగా జాబితాను రిలీజ్ చేశామని తెలిపింది. రోస్టర్ ప్రకారమే పోస్టుల భర్తీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. ప్రతి అన్సర్ షీట్‌ను ఇద్దరు ఎవాల్యుయేటర్లు మూల్యాంకనం చేసినట్లు పేర్కొంది.
News March 14, 2025
రూపీ సింబల్ మార్పు.. విమర్శలు

తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం రూపీ <<15745743>>సింబల్‌ను<<>> మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది విభజనవాదానికి దారి తీస్తుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు సొంత రూపీ సింబల్ అంటున్నారని, రానురాను సొంత మిలిటరీ, సొంత దేశం అని కూడా అనొచ్చని చెబుతున్నారు. కేంద్రంతో వివాదం ఉంటే దేశం మొత్తానికి వర్తించే రూపీ సింబల్ మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి స్టాలిన్ సర్కార్ నిర్ణయంపై మీ కామెంట్?
News March 14, 2025
WARNING: మూడు రోజుల పాటు వడగాలులు

AP: కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ నెల 16 వరకు కోస్తాలో వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. కాగా నిన్న ప్రకాశంలోని పెద్దదోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు APSDMA వెల్లడించింది. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది.