News March 13, 2025
‘జన్మభూమి’ ఇక సికింద్రాబాద్‌లో ఆగదు! వివరాలివే

విశాఖ-లింగంపల్లి మధ్య తిరిగే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ వచ్చే నెల 25 నుంచి సికింద్రాబాద్‌లో ఆగదు. దాని ప్రయాణమార్గాన్ని మళ్లిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ ప్రకటించింది. శాశ్వత ప్రాతిపదికన లింగంపల్లి నుంచి చర్లపల్లి-అమ్ముగూడ-సనత్ నగర్ మీదుగా వెళ్లేలా ఏర్పాట్లు చేశామని స్పష్టం చేసింది. సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్లవైపు వెళ్లదని, ప్రయాణికులు గుర్తుంచుకోవాలని కోరింది.
Similar News
News March 25, 2025
నేడు, రేపు సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు CCLA ప్రారంభ ఉపన్యాసం, ఆ తర్వాత CS, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం కలెక్టర్ల సమావేశంపై సీఎం ప్రసంగిస్తారు. నేడు వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.
News March 25, 2025
బండి సంజయ్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి: బీఆర్ఎస్

TG: మాజీ సీఎం, BRS అధినేత KCRపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సంజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అక్కడ ప్రింట్ చేసిన డబ్బునే ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారని BRS తన ఫిర్యాదులో పేర్కొంది.
News March 25, 2025
పిల్లల్లో కంటి చూపు సమస్యలు.. నివారణ ఇలా

చాలా మందికి చిన్నతనంలోనే కంటి చూపు సమస్యలొస్తున్నాయి. ఎక్కువ స్క్రీన్ టైమ్, లో లైట్‌లో చదవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం వంటివి దీనికి కారణాలు. ఈ సమస్య పోయి కంటిచూపు మెరుగుపడాలంటే స్క్రీన్ టైమ్ తగ్గించుకోవడంతో పాటు సహజ కాంతి, పచ్చని వాతావరణంలో ఆడుకోవడం, సరైన ఆహారం తీసుకోవడం (క్యారెట్, పాలకూర, టమాట, బాదం, వాల్‌నట్స్), కంటి వ్యాయామాలు, రోజూ 8-10hrs నిద్రపోవడం వంటివి పాటించాలని నిపుణులు చెబుతున్నారు.