News March 13, 2025
అమెరికా మాజీ అధ్యక్షుడి నిర్మాణంలో ‘టైగర్ వుడ్స్’ బయోపిక్

స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ జీవితంపై బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘వెరైటీ’ మ్యాగజైన్ కథనం ప్రకారం.. US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఆ సినిమాను నిర్మిస్తారు. వుడ్స్ జీవితంపై కెవిన్ కుక్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉండనుంది. గోల్ఫ్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన వుడ్స్, ఆ తర్వాత వివాహేతర సంబంధాలు సహా పలు వివాదాల్లో చిక్కుకున్నారు.
Similar News
News March 24, 2026
యుద్ధం.. అమెరికాతో జైశంకర్ చర్చలు

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియోతో విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై చర్చించారు. ముఖ్యంగా హార్ముజ్ వివాదం నేపథ్యంలో ఇంధన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఐదు రోజులు వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 దేశాలు నిరంతరం టచ్‌లో ఉండాలని నిర్ణయించాయి.
News March 24, 2026
ట్రంప్ ప్రకటనతో దిగొచ్చిన చమురు ధరలు

ఇరాన్‌పై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో యుద్ధ భయాలు తగ్గాయి. దీంతో చమురు ధరలు 13% మేర దిగొచ్చి $95 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు సోమవారం ఉదయం భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు సాయంత్రానికి మళ్లీ పుంజుకున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ₹1.46 లక్షల వరకు చేరింది. ఈ సానుకూల పవనాలతో మంగళవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
News March 24, 2026
స్మార్ట్‌ఫోన్ అతిగా చూస్తే ఈటింగ్ డిజార్డర్స్

స్మార్ట్‌ఫోన్ అతిగా వాడటం వల్ల కేవలం కంటి సమస్యలే కాకుండా ‘ఈటింగ్ డిజార్డర్స్’ కూడా వస్తాయని తాజా పరిశోధనలో తేలింది. ముఖ్యంగా రోజుకు 7 గంటల కంటే ఎక్కువ సమయం ఫోన్‌తో గడిపే యూత్‌లో ఈ ముప్పు ఎక్కువగా ఉంది. ఆన్‌లైన్‌లో కనిపించే ఐడియల్ బాడీ షేప్‌తొ తమను పోల్చుకోవడం వల్ల మెంటల్ టెన్షన్‌కు లోనై అదుపు లేకుండా తినడం లేదా అసలు తినకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తేలింది.


