News March 13, 2025
అమెరికా మాజీ అధ్యక్షుడి నిర్మాణంలో ‘టైగర్ వుడ్స్’ బయోపిక్

స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ జీవితంపై బయోపిక్ తెరకెక్కనున్నట్లు సమాచారం. ‘వెరైటీ’ మ్యాగజైన్ కథనం ప్రకారం.. US మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఆ సినిమాను నిర్మిస్తారు. వుడ్స్ జీవితంపై కెవిన్ కుక్ అనే రచయిత రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమా స్క్రీన్‌ప్లే ఉండనుంది. గోల్ఫ్ ప్రపంచంలో తిరుగులేని రారాజుగా ఓ వెలుగు వెలిగిన వుడ్స్, ఆ తర్వాత వివాహేతర సంబంధాలు సహా పలు వివాదాల్లో చిక్కుకున్నారు.
Similar News
News February 7, 2026
పుష్కరాలకు సర్వం సిద్ధం చేయాలి: మంత్రి దుర్గేశ్

గోదావరి మహా పుష్కరాలు-2027 రాష్ట్ర ప్రతిష్ఠకు నిదర్శనమని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కీర్తి చేకూరి, జిల్లా ఎస్పీతో కలిసి ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయం ఉండాలని, భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

జగిత్యాల: ‘ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి’

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు–2026 ఫిబ్రవరి 11న నిర్వహించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వినియోగించే అవకాశం కల్పించామని చెప్పారు. ఫిబ్రవరి 8న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక కౌంటర్లలో ఓటు వేయవచ్చని అని తెలిపారు.