News March 13, 2025
పాత సామాను బయటికెళ్లాలి: రాజాసింగ్

TG: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పాత సామాను పార్టీ నుంచి బయటికెళ్లి పోవాలని ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలో ఏ ప్రభుత్వం వస్తే వాళ్లతో రహస్యంగా భేటీ అవుతున్నారు. గొప్పలు చెప్పుకునేవాళ్లకు రిటైర్మెంట్ ఇస్తేనే బీజేపీకి మంచి రోజులు. దీనిపై జాతీయ నాయకత్వం కూడా ఆలోచన చేయాలి. నేనొక్కడినే కాదు.. ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే కోరుకుంటున్నాడు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News March 13, 2025
HRA క్లెయిమ్ చేయడానికి ఫేక్ రెంటు రిసిప్టులు పెడుతున్నారా..!

ఫేక్ రిసిప్టులతో HRA TAX బెనిఫిట్స్ పొందుతున్న వారిని IT శాఖ ఈజీగా గుర్తించి ఆదాయంపై 200% పెనాల్టీ వేస్తోందని నిపుణులు అంటున్నారు. HRA క్లెయిమ్ చేసుకొని సరైన రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వకుంటే, రెంట్ రిసిప్టుపై యజమాని PAN వివరాలు తప్పుగా ఇస్తే, FORM 16లో కంపెనీ HRA బెనిఫిట్స్ నమోదు చేయకున్నా ఉద్యోగి క్లెయిమ్ చేస్తే, సరైన డాక్యుమెంటేషన్ లేకుండా పేరెంట్స్, చుట్టాలకు రెంటు ఇచ్చినట్టు చెప్తే దొరకడం ఖాయం.
News March 13, 2025
తెలంగాణ భవన్‌కు హరీశ్‌రావు తరలింపు

TG: ట్యాంక్‌బండ్ పైనున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనంలో తెలంగాణ భవన్‌కు తరలిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్, జగదీశ్ రెడ్డి తదితరులను పోలీసులు అక్కడికి తరలించారు.
News March 13, 2025
ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

AP: రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.