News March 13, 2025

జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

image

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెంటనే ఆయన సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.

Similar News

News March 14, 2025

IPL 2025: బుమ్రా ఎంట్రీ ఎప్పుడంటే?

image

ఐపీఎల్-2025 ప్రారంభంలో ముంబై ఆడే కొన్ని మ్యాచులకు బుమ్రా దూరం కానున్నారు. ఏప్రిల్ తొలి వారంలో ఆయన జట్టులో చేరతారని క్రీడా వర్గాలు తెలిపాయి. వెన్ను గాయంతో బాధపడుతున్న ఆయన ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన సంగతి తెలిసిందే. కాగా MI తన తొలి మ్యాచును మార్చి 23న CSKతో ఆడనుంది. ఆ తర్వాత 29న గుజరాత్ టైటాన్స్, 31న KKRతో తలపడనుంది. బుమ్రా లేకపోవడం ఆ జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.

News March 14, 2025

సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదు: CM

image

AP: టీడీపీ నాయకులు ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదని సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. తాను ఇలా చెబితే.. వైసీపీకి ఓటేసిన వారికి పథకాలు ఇవ్వొద్దన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వివక్ష ఉండదని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయ సంబంధాలు వేరని వ్యాఖ్యానించారు.

News March 14, 2025

ఏప్రిల్ 9 నుంచి 1-9వ తరగతి ఎగ్జామ్స్

image

TG: రాష్ట్రంలో 1-9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు (సమ్మేటివ్ అసెస్‌మెంట్-2) ఏప్రిల్ 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 17న పరీక్షలు ముగుస్తాయని, అనంతరం జవాబుపత్రాలను మూల్యాంకనం చేసి అదే నెల 23న ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ నిర్ణయించింది. తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ రిపోర్టులు అందించాలని ఆదేశించింది.

error: Content is protected !!