News March 13, 2025
జగదీశ్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ సెషన్ పూర్తయ్యేవరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. వెంటనే ఆయన సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు.
Similar News
News April 10, 2026
ఇంట్లో నోట్ల కట్టలు.. జస్టిస్ వర్మ రాజీనామా

అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తన రిజైన్ లెటర్‌ను పంపారు. గతేడాది ఢిల్లీలోని జస్టిస్ వర్మ నివాసంలో భారీగా <<17379382>>డబ్బు కట్టలు<<>> బయట పడిన విషయం తెలిసిందే.
News April 10, 2026
మోదీ హత్యకు కుట్ర.. ముగ్గురి అరెస్ట్

ప్రధాని మోదీ హత్యకు కుట్ర చేశారనే ఆరోపణలతో బిహార్ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు. తాను మోదీని 22 రోజుల్లో హతమారుస్తానని, భారీగా డబ్బు ఇవ్వాలంటూ అమెరికా నిఘా సంస్థ CIAకు అమన్ తివారీ ఈమెయిల్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు బక్సర్ జిల్లాలో అతడిని అదుపులోకి తీసుకొని మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత అతని ఇద్దరు అనుచరులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
News April 10, 2026
భారతీయులకు పింక్ లిప్స్ ఎందుకు ఉండవంటే?

భారతీయులకు అమెరికన్లలా సహజంగా పింక్ లిప్స్ ఉండకపోవడానికి ప్రధాన కారణం ‘మెలనిన్’అని మాజీ AIIMS డెర్మటాలజిస్ట్ ఆంచల్ పంత్ వివరించారు. ‘మన చర్మం సూర్యరశ్మి నుంచి రక్షణ పొందేందుకు ఎక్కువ మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో పెదవులు గోధుమ, నలుపు రంగులో కనిపిస్తాయి. విదేశీయుల్లో మెలనిన్ తక్కువగా ఉండి రక్తనాళాలు బయటకు కనిపిస్తాయి. అందుకే పెదవులు పింక్ కలర్‌లో ఉంటాయి. ఇది జన్యుపరమైన మార్పే’ అని తెలిపారు.


