News March 13, 2025

ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

image

AP: రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. జనసేన నుంచి నాగబాబు, టీడీపీ నుంచి బీటీ నాయుడు, కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీజేపీ నుంచి సోము వీర్రాజు ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరి ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.

Similar News

News March 10, 2026

12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

image

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.

News March 10, 2026

చమురు ధరలకు మళ్లీ రెక్కలు?

image

ఇప్పుడిప్పుడే తగ్గుతున్న <<19341758>>క్రూడ్<<>> ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 10%కుపైగా తగ్గిన US క్రూడ్ ఇప్పుడు కోలుకొని -4% వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధరల తగ్గుదల కూడా తటస్థంగా ఉంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. ఇరాన్‌పై ఎప్పుడూ లేని రేంజ్‌లో భీకర దాడులు చేస్తామని <<19348669>>US<<>> చెప్పడం, డ్రోన్ దాడికి UAEలోనే అతిపెద్దదైన అబుదాబి ఆయిల్ రిఫైనరీ మూతపడటం కారణాలుగా తెలుస్తోంది.

News March 10, 2026

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారులు

image

AP: రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 6 నెలల వరకు లేదా కొత్త పాలకవర్గాలు ఏర్పడే వరకు వీరి పాలన సాగనుంది. విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం, ఒంగోలు, విజయనగరం, మచిలీపట్నం, చిత్తూరు కార్పొరేషన్లు సహా ఇతర సంస్థలకు RDO, JCలను ప్రత్యేక అధికారులుగా నియమించింది.