News March 14, 2025
గన్నవరం నుంచి మంగళగిరికి హెలికాప్టరా?: వైసీపీ

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి మంగళగిరికి కూడా రూ.లక్షలు ఖర్చు చేసి హెలికాప్టర్లో తిరుగుతున్నారని వైసీపీ విమర్శించింది. ‘ప్రజలు అవస్థల్లో ఉన్నప్పుడు ఏనాడూ ఇంత హుటాహుటిన వెళ్లింది లేదు. సొంత విలాసాల కోసం మాత్రం ఎగురుకుంటూ వెళ్తారు. అటు కాశినాయన సత్రాలు కూల్చేసినా, ఇటు మహిళలపై వరుస దాడులు జరుగుతున్నా సేనానికి కనిపించదు.. వినిపించదు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News March 10, 2026
ప్రజాప్రతినిధుల శిక్షణ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సిద్ధిపేటలోని రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈ నెల 12న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమ నిర్వహణ గూర్చి జిల్లాలోని సర్పంచులు, మున్సిపల్ ఛైర్మెన్లు, కౌన్సిలర్లు శిక్షణ తరగతులకు సంబంధించిన ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో 99రోజుల కార్యక్రమంలో ఆయా థీమ్స్ పై ప్రజాప్రతినిధులకు శిక్షన ఇవ్వనున్నట్టు తెలిపారు.
News March 10, 2026
12pm-4pm పనులు రీషెడ్యూల్ చేసుకోండి: అనిత

AP: రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు. 12pm-4pm మధ్య బహిరంగ ప్రదేశాల్లో పనులుంటే రీషెడ్యూల్ చేసుకోవాలని కోరారు. APSDMA, RTGS నుంచి ఎప్పటికప్పుడు వడగాల్పుల హెచ్చరికలు చేరవేయాలని ఆ విభాగాల అధికారులతో జరిగిన సమీక్షలో ఆదేశించారు. వడదెబ్బ వల్ల ఒక్క ప్రాణం కూడా పోకూడదనే లక్ష్యంతో అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు.
News March 10, 2026
చమురు ధరలకు మళ్లీ రెక్కలు?

ఇప్పుడిప్పుడే తగ్గుతున్న <<19341758>>క్రూడ్<<>> ఆయిల్ ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 10%కుపైగా తగ్గిన US క్రూడ్ ఇప్పుడు కోలుకొని -4% వద్ద ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ధరల తగ్గుదల కూడా తటస్థంగా ఉంది. దీంతో చమురు ధరలు మళ్లీ పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. ఇరాన్‌పై ఎప్పుడూ లేని రేంజ్‌లో భీకర దాడులు చేస్తామని <<19348669>>US<<>> చెప్పడం, డ్రోన్ దాడికి UAEలోనే అతిపెద్దదైన అబుదాబి ఆయిల్ రిఫైనరీ మూతపడటం కారణాలుగా తెలుస్తోంది.


