News March 15, 2025

IMLT20: ఫైనల్ చేరిన వెస్టిండీస్

image

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20లో వెస్టిండీస్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శ్రీలంక మాస్టర్స్‌తో జరిగిన మ్యాచులో 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. ఛేదనలో గుణరత్నే(66) పోరాడినా శ్రీలంక 173 పరుగులకే పరిమితమైంది. రేపు జరిగే ఫైనల్లో ఇండియా మాస్టర్స్‌తో వెస్టిండీస్ తలపడనుంది.

Similar News

News March 16, 2026

క్యాన్సర్‌తో ప్రతి 18నిమిషాలకు ఒకరు మృతి

image

తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యాన్సర్ కేసు నమోదవుతుండగా, ప్రతి 18 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. 2025లో రాష్ట్రవ్యాప్తంగా 53,565 కొత్త కేసులు, 29,300 మరణాలు సంభవించాయి. దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ ముప్పు 15% ఎక్కువగా ఉంది. పొగాకు వాడకం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులే ఇందుకు ముఖ్య కారణాలు.

News March 16, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹2,240 తగ్గి ₹1,57,420కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹2,050 తగ్గి ₹1,44,300 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర ఈరోజు ₹4వేలు తగ్గి ₹2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండొచ్చు.

News March 16, 2026

CNG సరఫరాలో కొరత లేదు: కేంద్రం

image

దేశంలో ఇంధన లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా సాఫీగా సాగుతోందని స్పష్టం చేసింది. దేశంలో క్రూడ్ ఆయిల్ సరిపడా ఉందని.. రిఫైనరీలు అన్నీ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయంది. పెట్రోల్ పంప్స్‌లో ఎలాంటి కొరత లేదని పేర్కొంది. దేశానికి శివాలిక్, నందాదేవి నౌకల ద్వారా మరో 92,712 టన్నుల LPG రానున్నట్లు తెలిపింది.