News March 15, 2025
SRH అభిమానులకు గుడ్ న్యూస్

సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి యోయో టెస్టు పాసయ్యారు. బెంగళూరులోని NCAలో నిర్వహించిన ఈ పరీక్షలో నితీశ్ 18.1 పాయింట్లు సాధించారు. దీంతో ఆయన రేపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరతారు. కాగా ఈ ఏడాది జనవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆయన గాయపడ్డారు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పక్కటెముకల గాయానికి గురయ్యారు. అప్పటినుంచి ఎన్సీఏలో పునరావాసం పొందుతున్నారు.
Similar News
News April 1, 2026
HYD: నయా మస్తీ.. ‘కోల్డ్ బ్రూ’తో దోస్తీ!

టీ కొట్టు నుంచి కోల్డ్ బ్రూ వరకు.. కుర్రాళ్ల టేస్ట్ మారింది గురూ! ఇన్నేళ్లు రాజ్యమేలిన ఇరానీ ఛాయ్, ఫిల్టర్ కాఫీ ప్లేస్‌లో ‘కోల్డ్ బ్రూ’ చేరింది. కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్‌కే పరిమితం కాలేదు. గంటల కొద్దీ కాఫీ బీన్స్‌ను నానబెట్టి చేసే ఈ డికాక్షన్‌ను ఇంట్లోనే చేస్తూ ఫ్రెండ్స్‌తో షేర్ చేస్తున్నారు. కెఫిన్ కిక్ కంటే దాని మేకింగ్ ప్రాసెస్‌కే జెన్ జీ ఓటేస్తున్నారు. HYDలో ‘స్లో-కాఫీ’ కల్చరే హాట్ టాపిక్.
News April 1, 2026
రేపటి నుంచి అంగన్వాడీలు ఒంటిపూటే

TG: రాష్ట్రంలోని అంగన్వాడీలను రేపటి నుంచి ఒంటి పూట నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 30 వరకు ఉ.8 నుంచి మ.12.30 మధ్య ఈ కేంద్రాలు పని చేస్తాయి. మే 1 నుంచి 31 వరకు పిల్లలతోపాటు టీచర్లు, హెల్పర్లకు సెలవులు ఉంటాయి. అయితే హాలిడేస్‌లో పిల్లలకు సరకులను ఇంటి వద్దే పంపిణీ చేయాలి. ప్రీ-స్కూల్‌లో చిన్నారుల నమోదు చేపట్టాలి. ఇప్పటికే <<19394356>>ఏపీలో<<>> అంగన్వాడీలు ఒంటిపూట పనిచేస్తున్నాయి.
News March 31, 2026
PHOTOS: కోదండరాముడి కళ్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట

AP: ఒంటిమిట్టలో రేపు జరగబోయే కోదండరాముడి కళ్యాణానికి TTD భారీ ఏర్పాట్లు చేసింది. వేడుక జరిగే ప్రధాన వేదికతో పాటు భక్తులు కూర్చొనేందుకు ఆలయ సమీపంలో గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనుంది. అలాగే కళ్యాణం అనంతరం తలంబ్రాల ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు రేపు సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.


