News March 15, 2025

జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్?

image

నిన్న పవన్ వ్యాఖ్యలను బట్టి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్, త్రిభాషా విధానం, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు, గోద్రా మారణహోమంపై జనసేనాని మాట్లాడారు. తాను మహారాష్ట్ర, హరియాణాకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఘనస్వాగతం లభించిందని పేర్కొన్నారు. పవన్ దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని నాదెండ్ల మనోహర్ సైతం వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News July 7, 2025

మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టులో మార్పులు

image

లార్డ్స్‌లో ఈనెల 10 నుంచి భారత్‌తో జరిగే మూడో టెస్టుకు ఇంగ్లండ్ 16 మందితో జట్టును ప్రకటించింది. పేసర్ అట్కిన్సన్ స్క్వాడ్‌లోకి వచ్చారు. ఈ మ్యాచులో ENG 3 మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది. ఆర్చర్, అట్కిన్సన్‌, బెథెల్ తుది జట్టులో ఆడే ఛాన్సుందని ICC అంచనా వేసింది.
టీమ్: స్టోక్స్(C), ఆర్చర్, అట్కిన్సన్, బషీర్, బెథెల్, రూట్, పోప్, స్మిత్, ఓవర్టన్, బ్రూక్, కుక్, కార్స్, క్రాలీ, డకెట్, టంగ్, వోక్స్

News July 7, 2025

అప్పట్లో ఆశా పేరు చెబితే నోరు ఊరేది!!

image

ఇవాళ <<16972254>>చాక్లెట్<<>> అంటే కోకొల్లల పేర్లు, రుచులు. కానీ రీల్‌ను 20 ఏళ్లు వెనక్కి తిప్పితే ఆశా పేరుతో లిస్ట్ ఆరంభం. ఆశా, మ్యాంగో బైట్, కాఫీ బైట్, న్యూట్రిన్, ఆల్పెన్లిబి, చింతపండు చాక్లెట్ వంటివే ట్రెండ్. నిజానికి వీటిలో చాలా వరకు క్యాండీలు, టాఫీలు.. కానీ అప్పుడవే మన చాక్లెట్స్. అవి నోటిని తాకితే వచ్చే ఫీల్, కొనేందుకు డబ్బుల కోసం ఇంట్లో మన పోరాటం నేటికీ ఓ స్వీట్ మెమొరీ. మీ ఫెవరెట్ చాక్లెట్ ఏది? కామెంట్.

News July 7, 2025

ఇవాళ టారిఫ్ లెటర్స్ పంపిస్తాం: ట్రంప్

image

వివిధ దేశాలకు తాము ఇవాళ మ.12 గంటలకు (9:30 PM IST) టారిఫ్ లెటర్స్ పంపనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. BRICS అమెరికన్ వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపే ఏ దేశానికైనా అదనంగా 10% సుంకం విధిస్తామని హెచ్చరించారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని తెలిపారు. ఈ కొత్త టారిఫ్స్ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తాయని US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుత్నిక్ పేర్కొన్నారు.