News March 15, 2025

జాతీయ రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్?

image

నిన్న పవన్ వ్యాఖ్యలను బట్టి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. డీలిమిటేషన్, త్రిభాషా విధానం, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు, గోద్రా మారణహోమంపై జనసేనాని మాట్లాడారు. తాను మహారాష్ట్ర, హరియాణాకు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఘనస్వాగతం లభించిందని పేర్కొన్నారు. పవన్ దేశానికి ఉపయోగపడేలా ఎదగాలని నాదెండ్ల మనోహర్ సైతం వ్యాఖ్యానించారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News April 13, 2026

PHOTO: కండలు తిరిగిన శరీరంతో Jr.NTR

image

‘డ్రాగన్’ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తన శరీరాకృతిని పూర్తిగా మార్చుకుంటున్నారు. జిమ్‌లో కసరత్తులు చేస్తూ కండలు తిరిగిన బాడీ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇది క్షణాల్లోనే వైరలైంది. తారక్ బాడీ బాక్సాఫీస్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

News April 13, 2026

చర్చలు విఫలం.. మార్కెట్లలో బ్లడ్‌బాతేనా?

image

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడం, క్రూడాయిల్ ధర పెరగడంతో భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలు చవిచూసే అవకాశం ఉంది. యుద్ధం ఇంకా కొనసాగనుండటంతో ఇన్వెస్టర్లు షేర్ల అమ్మకాలకే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జపాన్ నిక్కీ-225.. 0.80%, టోపిక్స్ 0.42% నష్టపోయాయి. సౌత్ కొరియా కోప్సి 1.83%, కొస్దాక్ 1.43%, హాంగ్‌కాంగ్ హాంగ్ సెంగ్, ఆస్ట్రేలియా S&P/ASX 200 మైనస్‌లో ట్రెండ్ అవుతున్నాయి.

News April 13, 2026

ఊసరవెల్లికే పోటీ.. 2 రోజుల్లో 3 పార్టీల నుంచి నామినేషన్

image

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అరుదైన ఘటన జరిగింది. భరత్ సింగ్ వాఖ్లా అనే వ్యక్తి ఊసరవెల్లినే డామినేట్ చేస్తూ పార్టీల కండువాలను మార్చేశారు. దాహోద్(D) పైపెరో స్థానానికి రెండు రోజుల్లో 3 జాతీయ పార్టీల(BJP, INC, AAP) నుంచి నామినేషన్ వేశారు. ఎల్లుండితో విత్‌డ్రా గడువు ముగియనుండగా ఆయన అంతిమంగా ఏ పార్టీలో ఉంటారనేది ఆసక్తికరం. భరత్ 2017లో కాంగ్రెస్, 2022లో ఆప్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.