News March 15, 2025
ముస్లింలకే 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు?: DK శివకుమార్

ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4% రిజర్వేషన్లు ముస్లింలకే కేటాయించిందని కర్ణాటక సర్కారును ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేళ ఆ రాష్ట్ర Dy.CM డీకే శివ కుమార్ స్పందించారు. ‘కేవలం ముస్లింలకు 4% రిజర్వేషన్లు అని ఎవరు చెప్పారు. వెనకబడిన తరగతుల వారి కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మైనార్టీలు అంటే ముస్లింలే కాదు. అందులో క్రిస్టియన్లు, జైనులు, పార్సీలు, సిక్కులు, మొదలైన వారు ఉంటారు’ అని క్లారిటీ ఇచ్చారు.
Similar News
News March 16, 2025
న్యూజిలాండ్‌తో మ్యాచ్.. 91 రన్స్‌కి పాక్ ఆలౌట్

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్‌లో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాక్ 91 పరుగులకే ఆలౌటైంది. ఖుశ్దిల్ షా(30 బంతుల్లో 32) మాత్రమే ఫర్వాలేదనిపించారు. సల్మాన్ అఘా(18), జహాందాద్ ఖాన్(17) మాత్రమే రెండంకెల స్కోర్ దాటారు. 11 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయిన పాక్ ఏ దశలోనూ కోలుకునేలా కనిపించలేదు. కివీస్ బౌలర్లలో డఫీ 4 వికెట్లు, జేమీసన్ 3, సోధీ 2, ఫౌక్స్ ఒక వికెట్ తీశారు.
News March 16, 2025
నేడు అమరజీవి జయంతి

మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాలతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు. దీక్ష ప్రారంభించిన తొలిరోజు 53.9 కేజీలు ఉన్న ఆయన 58వ రోజుకు 38.1 కేజీలకు తగ్గారు. 1952 అక్టోబర్ 19 నుంచి డిసెంబర్ 15 వరకు దీక్ష చేశారు. దీక్ష చివరి రోజు ప్రాణాలు వదిలారు. ఈయన పోరాటంతో 1953 OCT 1న కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
News March 16, 2025
KG చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో గత వారంతో పోలిస్తే చికెన్ రేట్లు కాస్త పెరిగాయి. హైదరాబాద్ నగరంలో కేజీ స్కిన్ లెస్ చికెన్ గత వారం రూ.160-180గా ఉండగా ఇప్పుడు రూ.180-200 పలుకుతోంది. కామారెడ్డిలో రూ.160గా ఉంది. అటు ఏపీలోని కర్నూలులో రూ.180, అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం, పిఠాపురంలో రూ.220కి విక్రయిస్తున్నారు. మరి మీ ఏరియాలో చికెన్ రేట్లు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.