News March 16, 2025
బాపట్ల జిల్లా TO DAY TOP HEADLINES

◆బాపట్ల ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు◆మార్టూరు: పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం◆బాపట్ల: పరిసరాలను శుభ్రం చేసిన అడిషనల్ ఎస్పీ◆చీరాల: రైళ్లలో చోరీకి పాల్పడుతున్న దొంగ అరెస్టు◆బాపట్ల: ఇంటర్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్పెషలాఫీసర్◆వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి◆పర్చూరు మండలాన్ని కమ్మేసిన పొగ మంచు◆రాజకీయ చరిత్రలో సీఎం చంద్రబాబు అరుదైన రికార్డు: ఎమ్మెల్యే ఏలూరి
Similar News
News April 19, 2026
VZM: 21న ఫుట్బాల్, బాక్సింగ్ క్రీడా ఎంపికలు

ఈ నెల 21, 23, 24 తేదీల్లో జిల్లా స్థాయి ఫుట్బాల్, బాక్సింగ్ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడా అధికారి ఎస్.వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. ఏప్రిల్ 21న ఫుట్ బాల్ మహిళా, 23న ఫుట్ బాల్ పురుషులు, 24న బాక్సింగ్ బాలబాలికలు ఎంపిక పోటీలు విజయనగరం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో జరగనున్నాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు https://sports.ap.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉ.8 గంటలకు హాజరుకావాలన్నారు.
News April 19, 2026
అవసరమైతేనే బయటకు రండి: కలెక్టర్

పల్నాడు జిల్లాలో ఎండలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయని కలెక్టర్ కృతికా శుక్లా హెచ్చరించారు. ముఖ్యంగా మే 31వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఉష్ణోగ్రతలు 45°C నుంచి 55°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
News April 19, 2026
T2OI కెప్టెన్‌గా శ్రేయస్?

T2OI కెప్టెన్‌గా సూర్యను తొలగించాలనుకుంటే సెలక్టర్లకు ఫస్ట్ ఆప్షన్ శ్రేయస్ అయ్యరే అని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. IPLలో శ్రేయస్ నాయకత్వం పట్ల సానుకూలతతోపాటు T20 క్రికెట్‌లో నాలుగో స్థానంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ మరొకరు లేరని పేర్కొంది. పంత్, గిల్ పోటీలో ఉన్నప్పటికీ అయ్యర్ వైపే మొగ్గుచూపుతున్నట్లు రాసుకొచ్చింది. సూర్యకు కెప్టెన్‌గా మంచి మార్కులు ఉన్నా ఆటగాడిగా ఫెయిలవుతున్నారు.


