News March 16, 2025
కన్నప్ప స్వగ్రామానికి మంచు విష్ణు

సినీ నటుడు మంచు విష్ణు శివభక్తుడు కన్నప్ప స్వగ్రామాన్ని సందర్శించారు. తన మూవీ టీమ్‌తో కలిసి అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరుకు వెళ్లారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్‌కుమార్‌తో పాటు ఇతర స్టార్‌లు నటించారు.
Similar News
News March 16, 2025
యూట్యూబర్ హర్ష సాయిపై కేసు

TG: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్ <<15767906>>హర్ష సాయిపై<<>> సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. తాను ఎవరిపై వ్యక్తిగతంగా పోరాటం చేయడం లేదని, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతో మంది నష్టపోతున్నారని, వీటిని నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
News March 16, 2025
టెస్లా కోసం ప్రభుత్వం ప్రయత్నాలు.. భూముల పరిశీలన

AP: అమెరికాకు చెందిన ఆటోమోటివ్ కంపెనీ టెస్లాను రాష్ట్రానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. తిరుపతి జిల్లా మేనకూరు, సత్యవేడులోని శ్రీసిటీతో పాటు కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా అభివృద్ధి చేస్తున్న క్రిస్ సిటీలో భూములను పరిశీలిస్తున్నారు. ఈ మూడు ప్రాంతాలు చెన్నైకి 120 కి.మీ దూరంలో ఉండటం, విమానాశ్రయాలు, పోర్టులు, నేషనల్ హైవేలు దగ్గరగా ఉండటం కలిసొస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
News March 16, 2025
పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య.. కొత్త విషయాలు

కాకినాడలో చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో పెద్ద కొడుకు జోషిల్ (6)ను రూ.లక్షల్లో ఫీజులు ఉన్న ఓ స్కూల్లో చేర్పించాడు. ఆర్థిక ఇబ్బందులతో చిన్న స్కూలుకు మార్చాడు. లక్షలు కట్టి చదివించగలనా? ఈ పోటీ ప్రపంచంలో పోటీ పడగలరా? అనే ఆత్మన్యూనతతో ఇలా చేసినట్లు భావిస్తున్నారు. చంద్రశేఖర్ అంత కర్కశుడు కాదని బంధువులు చెబుతున్నారు.