News March 16, 2025

మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హత్య

image

లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు అబు ఖతల్ నిన్న రాత్రి పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు మాస్టర్ మైండ్ అయిన హఫీజ్ సయీద్‌కు ఇతడు దగ్గరి అనుచరుడు. సయీద్ ఆదేశాలతో J&Kలోని మైనారిటీలు, భద్రతా బలగాలపై దాడులకు పాల్పడ్డాడు. ఖతల్ పర్యవేక్షణలోనే రియాసీ జిల్లాలోని భక్తుల బస్సుపై దాడి జరిగింది. ఇందులో 9 మంది మరణించారు. ఖతల్ కోసం NIA ఎప్పటినుంచో వెతుకుతోంది.

Similar News

News March 16, 2025

శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్

image

AP: ఇటీవల శ్రీశైల మల్లన్న భక్తులు పలువురు నకిలీ వెబ్‌సైట్లను నమ్మి మోసపోవడంతో ఆలయం ఈవో శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. వసతి, దర్శనం, ఆర్జిత సేవల టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లోనే బుక్ చేసుకోవాలన్నారు. www.srisailamdevasthanam.org, www.aptemples.ap.gov.in దేవస్థానం, దేవాదాయ శాఖ వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలన్నారు. దేవస్థానం వివరాలకు 83339 01351, 52, 53 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

News March 16, 2025

విద్యార్థినులపై ప్రొఫెసర్ లైంగికదాడి.. వీడియోలు వైరల్

image

విద్యార్థినుల పాలిట గురువే కీచకుడిగా మారాడు. యూపీ హథ్రాస్‌లోని పీజీ కాలేజీ ప్రొఫెసర్ విద్యార్థినులకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన 59 వీడియోలు సోషల్ మీడియాలో వైరలవ్వగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసి అతడి కోసం గాలింపు చేపట్టారు. కాగా ప్రొఫెసర్ గతంలోనూ ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడినట్లు సమాచారం. దీనిపై కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం గమనార్హం.

News March 16, 2025

SRH: ఈసారి 300 పక్కా.. తగ్గేదేలే!

image

IPL 2025 కోసం SRH సిద్ధమవుతోంది. ఇప్పటికే ఉప్పల్ స్టేడియంలో ప్రాక్టీస్ మ్యాచులు మొదలుపెట్టింది. ఈ మ్యాచుల్లో జట్టు ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. SRH-A ఆటగాళ్లు అయితే 5.4 ఓవర్లలోనే 100 పరుగులు బాదేశారు. ఈ జోరు చూస్తుంటే ఈసారి కచ్చితంగా 300 పరుగులు దాటిస్తారని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా గత సీజన్‌లో RCBపై SRH 287/3 పరుగులు చేసి IPL చరిత్రలోనే హయ్యెస్ట్ స్కోర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.

error: Content is protected !!