News March 24, 2024
రేపటి నుంచి తిరుపతమ్మ చిన తిరునాళ్లు

AP: NTR(D) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో చిన తిరునాళ్లు రేపటి నుంచి నిర్వహించనున్నారు. 29వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. రేపు ఉదయం 6 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో తిరునాళ్లు ప్రారంభం కానుండగా.. 26న రథోత్సవం, తిరుపతమ్మ, గోపయ్య స్వాములను గ్రామంలో ఊరేగిస్తారు. 27న దివ్యప్రభోత్సవం, 28న పసుపు కుంకుమ బండ్ల ఉత్సవం, 29న బోనాల సమర్పణతో తిరునాళ్లు ముగుస్తాయి.
Similar News
News April 20, 2025
ఆయన వల్లే IPL సాధ్యమైంది: లలిత్ మోదీ

ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ వల్లే ఐపీఎల్ ఆలోచన కార్యరూపం దాల్చిందని లీగ్ ఫౌండర్ లలిత్ మోదీ చెప్పారు. తనను గుడ్డిగా నమ్మి ప్రోత్సహించడంతోనే ఐపీఎల్ కల నిజమైందని ఇన్‌స్టాలో ఆర్టికల్‌ను పోస్ట్ చేశారు. ఇప్పుడు IPL లేకుండా క్రికెట్ ప్రపంచాన్నే ఊహించలేమన్నారు. పవార్ విజనరీని మరిచిపోవద్దన్నారు. శరద్ పవార్ 2005-08 మధ్య బీసీసీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.
News April 20, 2025
క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. యువకుడి మృతి

TG: మేడ్చల్(D) రాంపల్లి దాయరలో విషాదం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతూ ప్రణీత్(32) గ్రౌండ్‌లోనే కుప్పకూలాడు. త్యాగి స్పోర్ట్స్ వెన్యూ గ్రౌండ్‌లో మ్యాచ్ ఆడుతుండగా అతనికి గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ప్రణీత్‌ను బోయినపల్లి వాసిగా గుర్తించారు.
News April 20, 2025
బాలుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి.. మహిళకు జైలు శిక్ష

రాజస్థాన్‌లో ఓ బాలుడిని(17) అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మహిళ(30)కు బుండీ పోక్సో కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2023 నవంబరు 7న ఘటన జరగగా, బాధితుడి తల్లి అప్పట్లో పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితురాలు తమ కుమారుడికి మద్యం పట్టించి లైంగిక దాడికి పాల్పడిందని వారికి తెలిపారు. దర్యాప్తులో ఫిర్యాదు నిజమని నిర్ధారణ కావడంతో పోక్సో కోర్టు నిందితురాలికి జైలు శిక్షతో పాటు రూ.45వేల జరిమానా విధించింది.