News March 24, 2024

రేపటి నుంచి తిరుపతమ్మ చిన తిరునాళ్లు

image

AP: NTR(D) పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయంలో చిన తిరునాళ్లు రేపటి నుంచి నిర్వహించనున్నారు. 29వ తేదీ వరకు జరిగే ఈ వేడుకకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు భారీగా తరలిరానున్నారు. రేపు ఉదయం 6 గంటలకు అఖండజ్యోతి స్థాపనతో తిరునాళ్లు ప్రారంభం కానుండగా.. 26న రథోత్సవం, తిరుపతమ్మ, గోపయ్య స్వాములను గ్రామంలో ఊరేగిస్తారు. 27న దివ్యప్రభోత్సవం, 28న పసుపు కుంకుమ బండ్ల ఉత్సవం, 29న బోనాల సమర్పణతో తిరునాళ్లు ముగుస్తాయి.

Similar News

News April 19, 2026

‘జంబలకిడిపంబ’… బరాత్‌తో వధువు ఎంట్రీ ఆ తర్వాత..

image

పెళ్లి జరిగింది, అప్పగింతలు అవుతున్నాయి.. కట్ చేస్తే ఇక్కడ కన్నీళ్లు పెట్టుకుంది వధువు కాదు వరుడు! ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లాలోని సుపల్గా అనే గ్రామంలో ఈ సీన్ కనిపించింది. కొడుకులు లేకపోవడంతో కూతురిని వీడలేక వధువు తండ్రి సంబంధం టైమ్‌లోనే ఇల్లరికం ప్రతిపాదన తెచ్చాడు. ఇందుకు వరుడి కుటుంబం ఒప్పుకుంది. దీంతో అమ్మాయి ఊరేగింపుగా రావడం.. అబ్బాయిని పెళ్లాడి ఆమెతో పుట్టింటికి తీసుకుపోవడం జరిగాయి.

News April 19, 2026

US ఆర్మీని ఓడించడానికి సిద్ధం: మొజ్తబా

image

ఇరాన్-అమెరికా వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఓవైపు చర్చలకు సిద్ధమంటూనే <<19685626>>రెచ్చగొట్టే<<>> పనిలో ఇరు దేశాల నాయకులు ఉన్నారు. తమ ఓడరేవుల నుంచి రాకపోకలు సాగించే నౌకలను US ఇప్పటికీ దిగ్బంధిస్తుండటంతో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా బలగాలను ఘోరంగా ఓడించడానికి టెహ్రాన్ నేవీ సిద్ధంగా ఉందని చెప్పారు. మరోవైపు హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఇవాళ మళ్లీ <<19682480>>మూసేసిన<<>> విషయం తెలిసిందే.

News April 19, 2026

RCBకి శాపంగా గ్రీన్ జెర్సీ!

image

ఆర్సీబీకి మరోసారి గ్రీన్ జెర్సీ కలిసి రాలేదు. పర్యావరణ పరిరక్షణ కోసం 2011 సీజన్ నుంచి బెంగళూరు ప్లేయర్లు ఒక్కో మ్యాచులో ఈ గ్రీన్ కలర్ జెర్సీ ధరిస్తున్నారు. ఇప్పటివరకు ఈ జెర్సీలో 15 మ్యాచులు ఆడగా అందులో తొమ్మిదింట్లో (ఇవాళ ఢిల్లీతో కలిపి) ఓడింది. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఆడిన తొలి, 50వ, 100వ మ్యాచుల్లో ఓటమిపాలు కావడం గమనార్హం.