News March 24, 2024
మాజీ సైనికులకు బీబీనగర్ ఎయిమ్స్‌లో నగదు రహిత వైద్యం

దేశ రక్షణ కోసం పోరాడిన తెలుగు రాష్ట్రాల్లోని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని బీబీనగర్ ఎయిమ్స్ ముందుకొచ్చింది. తాజాగా ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్(ECHS)తో ఒప్పందం చేసుకుంది. ఇకపై నగదు అవసరం లేకుండా అన్నిరకాల వైద్య పరీక్షలు, ఆపరేషన్లను చేయనుంది. దీంతో దాదాపు 90వేల మందికి లబ్ధి చేకూరనుంది.
Similar News
News January 14, 2026
మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదా?

మకర జ్యోతి, మకర విళక్కు ఒకటి కాదు. సంక్రాంతి రోజున ఆకాశంలో కనిపించే ఓ దివ్య నక్షత్రాన్ని మకర జ్యోతి అంటారని, ఇది ప్రకృతి సిద్ధమైనదని శబరిమల ప్రధానార్చకులు తెలిపారు. అదే సమయంలో పొన్నంబళమేడు కొండపై మూడు సార్లు ఓ హారతి వెలుగుతుంది. ఈ దీపారాధనను స్థానిక గిరిజనులు చేస్తారని దేవాలయ సిబ్బంది చెబుతోంది. ఈ హారతినే మకర విళక్కుగా భావిస్తారు. ఇది మానవ నిర్మితమని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు స్పష్టం చేసింది.
News January 14, 2026
ఇంటర్వ్యూతో BARCలో ఉద్యోగాలు

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<
News January 14, 2026
విజయ్ మాతో పొత్తు పెట్టుకో.. బీజేపీ ఆఫర్

తమిళనాడులో తమతో పొత్తు పెట్టుకోవాలని TVK పార్టీని బీజేపీ ఆహ్వానించింది. వచ్చే ఎన్నికల్లో DMK గెలిచే అవకాశమే లేదని, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఏకం చేయాల్సిన అవసరం ఉందని BJP నేత అన్నామలై అన్నారు. డీఎంకే వ్యతిరేక పార్టీలన్నీ కలవాల్సిన అవసరం ఉందని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. కాగా బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని అంతకుముందు TVK డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ తేల్చి చెప్పారు.


