News March 24, 2024

మాజీ సైనికులకు బీబీనగర్ ఎయిమ్స్‌లో నగదు రహిత వైద్యం

image

దేశ రక్షణ కోసం పోరాడిన తెలుగు రాష్ట్రాల్లోని మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లోని బీబీనగర్ ఎయిమ్స్ ముందుకొచ్చింది. తాజాగా ఎక్స్ సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్‌(ECHS)తో ఒప్పందం చేసుకుంది. ఇకపై నగదు అవసరం లేకుండా అన్నిరకాల వైద్య పరీక్షలు, ఆపరేషన్లను చేయనుంది. దీంతో దాదాపు 90వేల మందికి లబ్ధి చేకూరనుంది.

Similar News

News November 10, 2024

ఆ బోర్డు నాలుగు అక్షరాల క్రూరత్వం: కేంద్రమంత్రి

image

వక్ఫ్ బోర్డుపై కేంద్ర మంత్రి సురేశ్ గోపి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అది ఒక నాలుగు ఆంగ్ల అక్షరాల ‘క్రూరత్వం” అని అన్నారు. కేరళలోని మునంబామ్‌లో క్రిస్టియన్లకు చెందిన 400 ఎకరాలు తమకు చెందుతాయని వక్ఫ్ బోర్డు అనడాన్ని తప్పుబట్టారు. త్వరలో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తుందని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మండిపడింది. ప్రజలను విభజించి పాలించే ప్రకటనలు మానుకోవాలంది.

News November 10, 2024

అంగన్వాడీలను GOVT ఉద్యోగులుగా పరిగణించాలి.. గుజరాత్ హైకోర్టు

image

అంగన్వాడీ సిబ్బందిని శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గుజరాత్ హైకోర్టు ఆదేశించింది. నాలుగో తరగతి కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ₹15K ఇస్తుంటే అంగన్వాడీలకు ₹5-10K గౌరవ వేతనమే ఇస్తున్నారని పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీంతో వారిని GOVTసర్వీసులోకి తీసుకుని పే స్కేల్ గురించి పేర్కొనాలని ధర్మాసనం తీర్పుఇచ్చింది. ఇది అమలైతే దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది.

News November 10, 2024

ప్రభాస్ ‘సలార్-2’లో కొరియన్ నటుడు?

image

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కనున్న ‘సలార్-2’లో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ నటించనున్నట్లు సమాచారం. తాజాగా ఆయన ‘సలార్-2’ పోస్టర్‌ను ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టుకోవడంతో ఈ మూవీలో నటించనున్నారనే చర్చ మొదలైంది. ‘ది ఔట్‌లాస్’, ‘ది గ్యాంగ్ స్టర్’, ‘అన్‌స్టాపబుల్’, ‘ఛాంపియన్’ వంటి హాలీవుడ్, కొరియన్ చిత్రాల్లో ఆయన నటించారు. అంతకుముందు స్పిరిట్‌లోనూ డాన్ లీ నటిస్తారనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే.