News March 17, 2025

అన్ని జిల్లాల పర్యటనకు కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్‌లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.

Similar News

News March 17, 2025

AP న్యూస్ రౌండప్

image

* YSR జిల్లాను YSR కడప జిల్లాగా మారుస్తూ క్యాబినెట్ నిర్ణయం
* భోగాపురం ఎయిర్‌పోర్టులో బాంబు పేలి ఒకరి మృతి
* తెనాలి: స్పెషల్ తెలుగుకు బదులు తెలుగు క్వశ్చన్ పేపర్ ఇచ్చిన ఇన్విజిలేటర్ సస్పెండ్
* కోనసీమ(D) నెలపతిపాడులో పిల్లలను కాలువలో తోసి తండ్రి సూసైడ్.. బాలుడు(10) సురక్షితం, బాలిక(6) మృతి
* చిత్తూరు TDP కార్యకర్త హత్య కేసులో ఇద్దరు అరెస్ట్
* తిరుమలలో BCY పార్టీ చీఫ్ రామచంద్రయాదవ్ నిరసన..అరెస్ట్

News March 17, 2025

ఈ సమయంలో పండ్లు తింటున్నారా?

image

మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లు తినడం ఎంతో అవసరం. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వాటిని ఆస్వాదించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. పరగడుపుతో అస్సలు తినకూడదు. అలా చేస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్‌లో అసమతుల్యత ఏర్పడుతుంది. అలాగే కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వీటిని తింటే శరీరంలో విషపూరిత పదార్థాలు పేరుకుపోతాయి. పడుకునే ముందు తీసుకోకూడదు. అజీర్తి సమస్యలు వస్తాయి. డెయిరీ పదార్థాలతో కలిపి వీటిని తినకూడదు.

News March 17, 2025

బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

image

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బీసీలకు స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ బిల్లు రూపొందించగా తాజాగా ఆమోదం లభించింది. అనంతరం అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

error: Content is protected !!