News March 17, 2025

అన్ని జిల్లాల పర్యటనకు కేటీఆర్

image

TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఈ నెల 20న సూర్యాపేట, 23న కరీంనగర్‌లో పర్యటిస్తారు. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సంబరాల విజయానికి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు.

Similar News

News April 23, 2025

ఉగ్రదాడి.. విశాఖ వాసి గల్లంతు?

image

AP: జమ్మూకశ్మీర్ పహల్‌గామ్‌లోని బైసరీన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి ఘటనలో విశాఖ వాసి గల్లంతైనట్లు సమాచారం. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి ఇటీవల అక్కడికి టూర్‌ వెళ్లారు. అయితే దాడి తర్వాత ఆయనకు బంధువులు ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. దీంతో చంద్రమౌళి భార్య పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన ఆచూకీ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News April 23, 2025

అదానీ స్పెక్ట్రమ్‌తో ఎయిర్‌టెల్ డీల్

image

అదానీ డేటా నెట్‌వర్క్స్‌ 26GHz బ్యాండ్‌లోని 400 మెగాహెర్జ్ స్పెక్ట్రమ్‌ను వాడుకునేందుకు ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం రూ.212 కోట్లు చెల్లించింది. గుజరాత్, ముంబై, ఏపీ, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడులోని స్పెక్ట్రమ్‌ను ఎయిర్‌టెల్ వినియోగించుకుంటుంది. దీనివల్ల 5G వేగం, నెట్‌వర్క్ కెపాసిటీ పెరగనుంది. యూజర్లకు నాణ్యమైన సేవలు అందుతాయి.

News April 23, 2025

ఉగ్రదాడి వెనుక TRF.. దీని చరిత్ర ఇదే

image

J&K పహల్గామ్‌లో జరిగిన పాశవిక <<16183726>>ఉగ్రదాడి<<>> వెనుక ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్(TRF)’ ఉన్నట్లు సమాచారం. ఇది పాక్‌కు చెందిన లష్కర్ ఏ తొయిబాకు అనుబంధ సంస్థ. ఆర్టికల్ 370 రద్దు తర్వాత 2019 AUGలో ఏర్పాటైంది. దీనికి షేక్ సాజిద్ కమాండర్, బాసిత్ అహ్మద్ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. దీన్ని కేంద్రం 2023లో ఉగ్రసంస్థగా ప్రకటించింది. కాగా నిన్న జరిగిన దాడిలో దాదాపు 30 మంది పౌరులు మరణించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!