News March 18, 2025

నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ

image

TG: ఇవాళ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ జరగనుంది. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు మాట్లాడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నట్లు సమాచారం. నిన్న ఈ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు. దీంతో పాటు యాదాద్రి బోర్డు ఏర్పాటుపై బిల్లు, అడ్వకేట్ వెల్ఫేర్, అడ్వకేట్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్, మున్సిపాలిటీల సవరణ బిల్లు, పంచాయతీ రాజ్ సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

Similar News

News September 18, 2025

జీకేవీధి: పాము కాటుకు గురై బాలిక మృతి

image

గూడెం కొత్తవీధిలోని బొంతువలసకు చెందిన మర్రి కవిత (9) పాము కాటుకు గురై మృతి చెందింది. ఇంట్లో పడుకున్న సమయంలో బుధవారం తెల్లవారుజామున పాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారిని తల్లిదండ్రులు పెద్దవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News September 18, 2025

3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్

image

AP: ఈ నెల 26 నుంచి 28 వరకు 3 రోజుల పాటు బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఇందులో భాగంగా సాహస క్రీడలు, ఎగ్జిబిషన్, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 27న సీఎం చంద్రబాబు బీచ్‌ను సందర్శించి, రూ.97 కోట్ల అభివృద్ధి పనులుకు శంకుస్థాపన చేస్తారని ప్రభుత్వం తెలిపింది. బాపట్ల పట్టణం నుంచి సూర్యలంక బీచ్ 9 కి.మీ దూరం ఉంటుంది.

News September 18, 2025

శ్రీవారి దర్శనానికి కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం శిలా తోరణం వరకూ భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోందని టీటీడీ తెలిపింది. నిన్న స్వామివారిని 68,213 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,410 మంది శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.2.86 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD వెల్లడించింది.