News March 18, 2025
సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ ఉన్నారు.
Similar News
News January 14, 2026
సంక్రాంతి ముగ్గులు.. 4 వైపులా గీతలు గీస్తున్నారా?

ముగ్గును ఎప్పుడూ ఇంటి గడప, వాకిలి ముందే వేయాలి. ముగ్గు వేసిన తర్వాత నాలుగు వైపులా అడ్డగీతలు గాలి. ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని, లక్ష్మీదేవి ఇంటిని విడిచి వెళ్లదని శాస్త్రం చెబుతోంది. అంతేకాకుండా ఆ గీతలు అక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయనే మంగళకరమైన సంకేతాన్ని ఇస్తాయి. ఈ నియమాలు పాటిస్తూ ముగ్గులు వేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది.
News January 14, 2026
T20 వరల్డ్ కప్: USA ప్లేయర్ల వీసాపై ఉత్కంఠ

T20 వరల్డ్ కప్‌కు ముందు USA క్రికెట్ జట్టుకు అనూహ్య సమస్య ఎదురైంది. పాకిస్థాన్ సంతతికి చెందిన అలీఖాన్, షయాన్ జహంగీర్, మొహమ్మద్ మొహ్సిన్, ఎహ్సాన్ ఆదిల్‌లు భారత్‌కు వచ్చేందుకు వీసా క్లియరెన్స్ కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీలంకలోని భారత హైకమిషన్‌లో వీసా ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ విదేశాంగ శాఖ నుంచి తుది అనుమతులు అవసరమని అధికారులు తెలిపారు. అయితే ఇది సాధారణ ప్రక్రియేనని ICC వర్గాలు స్పష్టం చేశాయి.
News January 14, 2026
మరో 9 అమృత్ భారత్ రైళ్లు.. ఏపీ మీదుగా వెళ్లేవి ఎన్నంటే?

కేంద్ర ప్రభుత్వం కొత్తగా 9 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో నాలుగు రైళ్లు పశ్చిమ బెంగాల్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడు, బెంగళూరు వరకు పరుగులు తీయనున్నాయి. ఖరగ్‌పూర్, భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన స్టేషన్లకు ఈ రైళ్లు కనెక్టివిటీని పెంచనున్నాయి. ఈ ట్రైన్లలో న్యూ జల్‌పాయ్‌గురి నుంచి తిరుచిరాపల్లి వెళ్లే రైలు దేశంలోనే అతి పొడవైన రూట్లలో ఒకటిగా నిలవనుంది.


