News March 18, 2025
సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, శ్యామల, కిరణ్ గౌడ్, సన్నీ యాదవ్, సుధీర్ రాజు, అజయ్ ఉన్నారు.
Similar News
News April 24, 2025
పహల్‌గామ్ దాడి.. ఉగ్రవాదులపై రివార్డు ప్రకటన

పహల్‌గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులపై జమ్మూ కశ్మీర్‌లోని అనంతనాగ్ పోలీసులు రివార్డు ప్రకటించారు. అదిల్ హుస్సేన్, అలీ భాయ్ (తల్హా భాయ్), హషీమ్ ముసా (సులేమాన్) ఊహాచిత్రాలతో పోస్టర్లు రిలీజ్ చేశారు. వారి ఆచూకీ గురించి సమాచారం ఇచ్చిన వారికి ఒక్కొక్కరిపై రూ.20లక్షల రివార్డు ఇస్తామని వెల్లడించారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
News April 24, 2025
రేపు ఆకాశం ‘నవ్వుతుంది’

ఆనందానికి చిహ్నమైన స్మైలీ ఫేస్ రేపు తెల్లవారుజామున ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. 5.30 గంటలకు శుక్రుడు, శని గ్రహాలు నెలవంకకు అతి చేరువగా రానున్నాయి. శుక్రుడు, శని 2 కళ్లుగా, నెలవంక నవ్వుతున్నట్లుగా కనిపించనుంది. సూర్యోదయానికి ముందు మాత్రమే ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించవచ్చని నాసా తెలిపింది. మన కళ్లతో నేరుగా దీన్ని చూడొచ్చని, టెలిస్కోప్, బైనాక్యులర్లతో మరింత క్లారిటీగా కనిపిస్తుందని వెల్లడించింది.
News April 24, 2025
పీఓకేలో 42 ఉగ్ర లాంచ్ ప్యాడ్స్!

ఆక్రమిత కశ్మీర్‌లో 42 లాంచ్ ప్యాడ్‌లను పాక్ సిద్ధం చేసినట్లు భారత భద్రతా బలగాలు గుర్తించాయి. 130మంది ఉగ్రవాదులు పైనుంచి ఆదేశాలు కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో చొరబడి విధ్వంసం సృష్టించేందుకు వీరు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మహ్మద్, లష్కరే నుంచి 60మంది ఉగ్రవాదులు, స్థానిక టెర్రరిస్టులు 17మంది కశ్మీర్‌లో యాక్టివ్‌గా ఉన్నారని నిఘా వర్గాలు తెలిపాయి.