News March 18, 2025

24 మంది దళితుల హత్య.. ముగ్గురికి మరణశిక్ష

image

UPలోని దిహులీ నరమేధం కేసులో మెయిన్‌పురి కోర్టు ముగ్గురికి మరణశిక్ష విధించింది. 1981 నవంబర్ 18న దిహులీ గ్రామంలోని SC కాలనీలోకి చొరబడిన సాయుధ దుండగుల బృందం పురుషులు, మహిళలు, పిల్లలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 24 మంది మరణించారు. 17 మంది నిందితులపై FIR నమోదవగా, 14 మంది విచారణ సమయంలో చనిపోయారు. మిగిలిన ముగ్గురికి కోర్టు శిక్ష విధించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది.

Similar News

News July 6, 2025

స్టాంప్ సవరణ బిల్లుతో ఉపయోగాలివే..

image

తెలంగాణ స్టాంప్ సవరణ బిల్లు-2025 తేవాలని <<16956370>>ప్రభుత్వం<<>> నిర్ణయించడంపై దీని ఉపయోగాలు ఏంటనే చర్చ మొదలైంది. చట్ట సవరణతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. కార్పొరేట్ సేవల రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీని పెంచడం, రియల్ ఎస్టేట్, వాణిజ్య ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడంతో అదనపు ఆదాయం సమకూరుతుంది. నకిలీ స్టాంప్ పేపర్లు, డూప్లికేట్లు, స్కామ్‌లకు అడ్డుకట్ట వేయొచ్చు.

News July 6, 2025

రేపు భారీ వర్షాలు

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని IMD తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ హైదరాబాద్ సహా దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 30-40కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.

News July 6, 2025

సీజేఐ భవనాన్ని వెంటనే ఖాళీ చేయించండి: SC అడ్మినిస్ట్రేషన్

image

సుప్రీంకోర్టు అడ్మినిస్ట్రేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలోని కృష్ణ మీనన్ మార్గ్‌లోని చీఫ్ జస్టిస్ బంగ్లాను వెంటనే ఖాళీ చేయించాలని కేంద్రాన్ని సూచించింది. ప్రస్తుతం అందులో మాజీ సీజేఐ డీవై చంద్రచూడ్ నివాసం ఉంటున్నారు. CJIగా చంద్రచూడ్ 2022 NOV నుంచి 2024 NOV వరకు పనిచేశారు. నిబంధన ప్రకారం రిటైర్మెంట్ తర్వాత 6నెలల వరకే(మే 31) ఆయనకు బంగ్లాలో ఉండటానికి అనుమతి ఉందని గుర్తు చేసింది.