News March 18, 2025

24 మంది దళితుల హత్య.. ముగ్గురికి మరణశిక్ష

image

UPలోని దిహులీ నరమేధం కేసులో మెయిన్‌పురి కోర్టు ముగ్గురికి మరణశిక్ష విధించింది. 1981 నవంబర్ 18న దిహులీ గ్రామంలోని SC కాలనీలోకి చొరబడిన సాయుధ దుండగుల బృందం పురుషులు, మహిళలు, పిల్లలపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 24 మంది మరణించారు. 17 మంది నిందితులపై FIR నమోదవగా, 14 మంది విచారణ సమయంలో చనిపోయారు. మిగిలిన ముగ్గురికి కోర్టు శిక్ష విధించింది. దీంతో 44 ఏళ్ల తర్వాత బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది.

Similar News

News July 6, 2025

తొలి ఏకాదశి రోజు ఏం చేయాలంటే?

image

ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి/శయన ఏకాదశి అంటారు. ఈరోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని నమ్ముతారు. ఉదయాన్నే తలస్నానం చేసి విష్ణువును తులసి దళాలతో పూజిస్తారు. ఈరోజు పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని, ఏకాదశి రోజున ఉపవాసముంటే మోక్షం కలుగుతుందని నమ్ముతారు. అలాగే ఈ ఒక్కరోజు ఉపవాసముంటే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఉపవాస ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు.

News July 6, 2025

ప్రపంచస్థాయి కెమికల్ హబ్స్ రావాలి: నీతిఆయోగ్

image

ప్రపంచస్థాయి కెమికల్స్ హబ్స్ స్థాపనపై కేంద్రం దృష్టి పెట్టాలని నీతి ఆయోగ్ ఓ నివేదికలో పేర్కొంది. ‘అత్యధిక సామర్థ్యాలుండే 8 పోర్ట్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌నూ స్థాపించాలి. 2040నాటికి భారత్ లక్షకోట్ల డాలర్ల రసాయనాల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. 2023లో గ్లోబల్ వ్యాల్యూ చెయిన్‌లో 3.5%గా ఉన్న వాటా 2040నాటికి 4-5శాతానికి పెరగనుంది. 2030నాటికి 7 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుంది’ అని నివేదికలో వివరించింది.

News July 6, 2025

మస్క్ కొత్త పార్టీతో ట్రంప్‌నకు నష్టమేనా?

image

ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ స్థాపించడం రిపబ్లిక్, డెమొక్రాటిక్ పార్టీలకు నష్టం చేకూర్చే అవకాశముంది. ముఖ్యంగా ట్రంప్‌నకు తలనొప్పి తీసుకురావొచ్చు. మస్క్ అపర కుబేరుడు, ఒక గొప్ప వ్యాపారవేత్త, ఒక్క ట్వీటుతో లక్షల మందిని ప్రభావితం చేయగల ఇన్‌ఫ్లుఎన్సర్. పైగా ‘మేక్ అమెరికా.. అమెరికా అగైన్’, ప్రజలకు స్వేచ్ఛనిప్పిస్తా అంటున్నారు. అయితే USలో 3 పార్టీల విధానం వర్కౌట్ అవ్వదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.