News March 24, 2024

పిఠాపురంలో పవన్‌కు ఓటమి తప్పదు: ముద్రగడ

image

AP: కాపుల కోసం పనిచేయడంతో రాజకీయంగా నష్టపోయినట్లు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. తనను చాలా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం బాధించిందన్నారు. వారిద్దరి ఓటమి కోసం తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. వైసీపీలో చేరకపోయి ఉంటే పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేవాడినన్నారు. ఆ నియోజకవర్గంలో పవన్ కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు.

Similar News

News September 15, 2025

ఇలాంటి మెసేజ్ మీకూ వచ్చిందా?

image

సైబర్ మోసగాళ్లు రోజుకో కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ‘ఇండియా పోస్ట్’ పేరిట ఫేక్ మెసేజులు పంపుతున్నారు. ‘మీ పార్సిల్ వేర్ హౌస్‌కి చేరుకుంది. అడ్రస్ సరిగ్గా లేకపోవడంతో డెలివరీ కుదర్లేదు. ఈ లింక్ ఓపెన్ చేసి 48 గంటల్లోగా అడ్రస్ అప్‌డేట్ చేయండి. లేదంటే పార్సిల్ రిటన్ వెళ్లిపోతుంది’ అని మెసేజ్‌లు పంపుతున్నారు. అవన్నీ ఫేక్ అని PIB FACT CHECK తేల్చింది. మీ వాళ్లకి ఈ విషయం షేర్ చేయండి.

News September 15, 2025

చలికాలం మరింత చల్లగా ఉండనుంది: నిపుణులు

image

అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లా నినా వల్ల చలి తీవ్రంగా ఉంటుంది అంటున్నారు. ఎల్‌ నినో దక్షిణ ఆసిలేషన్ సైకిల్‌లో శీతల దశైన లా నినా.. భూమధ్య రేఖ పసిఫిక్‌లో సముద్ర ఉష్ణోగ్రతలను తగ్గిస్తుంది అంటున్నారు. దాంతో వాతావరణంపై ప్రభావం ఉండనుంది. భారత్‌లో గతంలో కంటే చలి అధికంగా ఉంటుందని చెబుతున్నారు. తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.

News September 15, 2025

‘మిరాయ్’ మూవీని వదులుకున్న నాని!

image

తేజా సజ్జ హీరోగా తెరకెక్కిన ‘మిరాయ్’ మూవీని తొలుత నేచురల్ స్టార్ నానికి డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని వినిపించారని తెలుస్తోంది. ‘కథ విన్న వెంటనే నాని ఒప్పుకున్నారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు రావడంతో ఆయన ఈ మూవీని వదులుకున్నారు’ అని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత తేజాకు ఈ కథ చెప్పగా.. వెంటనే ఒప్పేసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది.