News March 24, 2024

పిఠాపురంలో పవన్‌కు ఓటమి తప్పదు: ముద్రగడ

image

AP: కాపుల కోసం పనిచేయడంతో రాజకీయంగా నష్టపోయినట్లు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. తనను చాలా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ కలవడం బాధించిందన్నారు. వారిద్దరి ఓటమి కోసం తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. వైసీపీలో చేరకపోయి ఉంటే పిఠాపురంలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసేవాడినన్నారు. ఆ నియోజకవర్గంలో పవన్ కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు.

Similar News

News November 12, 2024

ట్రంప్ ఆ నిర్ణయం తీసుకుంటే మనకు మంచిదే!

image

US అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక H-1B వీసాల‌పై ప‌రిమితులు విధిస్తే అది భారత్‌కు మేలు చేస్తుందని SBI నివేదిక అంచనా వేసింది. భార‌త్‌లో పెట్టుబ‌డులు పెర‌గడం, దేశీయ ఉత్పాద‌క‌త‌లో సంస్క‌రణలకు బాట‌లు వేసి మోదీ 3.0 ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌కు మేలు చేస్తుంద‌ని పేర్కొంది. అయితే, USలోని భార‌తీయ సంస్థ‌లు స్థానిక టాలెంట్‌ను హైర్ చేసుకునేందుకు అధిక వ‌న‌రుల‌ను వెచ్చించాల్సి వ‌స్తుంద‌ని పేర్కొంది.

News November 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 12, 2024

గ్యారంటీలు ఖ‌జానాకు భార‌మే: సీఎం

image

క‌ర్ణాట‌కలో ఐదు గ్యారంటీల అమ‌లు ప్ర‌భుత్వ ఖ‌జానాపై భారం మోపుతున్నాయ‌ని సీఎం సిద్ద రామ‌య్య అంగీక‌రించారు. అయినా ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను ఐదేళ్లూ అమ‌లు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 2024-25కు సంబంధించి ₹1.20 కోట్ల వార్షిక బ‌డ్జెట్‌లో ₹56 వేల కోట్లు గ్యారంటీల‌కు, ₹60 వేల కోట్లు అభివృద్ధి ప‌నుల‌కు కేటాయించిన‌ట్టు తెలిపారు. ఇది భార‌మే అయినా ప‌థ‌కాలు ఆప‌కుండా మ్యానేజ్ చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు.