News March 24, 2024
కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్

TG: హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో వైన్ షాపులు మూతపడనున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 26న ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయించినా, ఎవరైనా మద్యం సేవించి గొడవలు సృష్టించినా.. కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో తిరిగే వాహనాలపై కానీ, జనాలపై కానీ రంగులు చల్లకూడదని సూచించారు.
Similar News
News April 19, 2025
కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఫైర్

AP: విశాఖ <<16147304>>మేయర్ పీఠం కూటమి<<>> ప్రభుత్వం దక్కించుకోవడంపై వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ దుర్మార్గపు రాజకీయాలకు ఇది నిదర్శనమని మండిపడ్డారు. YCP 58 స్థానాలు గెలిస్తే, కూటమి 30 సీట్లే గెలిచిందని, ఏ రకంగా మేయర్ పదవి వస్తుందని ప్రశ్నించారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు.
News April 19, 2025
రాజ్ ఠాక్రేతో పొత్తుకు సిద్ధమే: ఉద్ధవ్ ఠాక్రే

మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. తన సోదరుడు, రాజ్ ఠాక్రేతో పొత్తుకు సిద్ధమన్నారు. మహారాష్ట్ర ప్రయోజనాల కోసం చిన్నచిన్న సంఘటనలను పక్కకు పెట్టి తన సోదరుడితో కలిసి నడుస్తామన్నారు. కాగా MNS చీఫ్ రాజ్ ఠాక్రే సైతం రెండు పార్టీలు కలవడం పెద్ద కష్టమేమీ కాదని వ్యాఖ్యానించారు. శివసేన పార్టీలో విభేదాలతో రాజ్ ఠాక్రే పార్టీనుంచి బయటకు వచ్చి MNSను స్థాపించారు.
News April 19, 2025
సిక్సర్ల రికార్డు సృష్టించిన కేఎల్ రాహుల్

ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ KL రాహుల్ రికార్డు సృష్టించారు. IPLలో భారత్ తరఫున తక్కువ ఇన్నింగ్సులలో 200 సిక్సులు కొట్టిన ప్లేయర్‌గా నిలిచారు. ఓవరాల్‌గా మూడోస్థానంలో ఉన్నారు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచులో సిక్సర్ బాది రాహుల్ ఈ ఫీట్ సాధించారు. రాహుల్ 129 ఇన్నింగ్సుల్లో 200 సిక్సర్లు కొట్టారు. ఈ జాబితాలో క్రిస్ గేల్ 69Inns, ఆండ్రీ రస్సెల్ 97Inns తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.