News March 19, 2025
నిర్మల్ : పరీక్షలకు 367మంది విద్యార్థులు గైర్హాజరు

నిర్మల్ జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాల్లో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 367మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈఓ పరుశురాం ప్రకటనలో తెలిపారు. మొత్తo 6416మంది విద్యార్థులకు పరీక్షకు కేటాయించగా ఇందులో 6049 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు.
Similar News
News January 12, 2026
మెదక్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్థంగా ఉపయోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 అర్జీలను స్వీకరించారు. ఇందులో భూభారతి-32, పెన్షన్-2, ఇందిరమ్మ ఇళ్లు-2, ఇతర సమస్యలపై- 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 12, 2026
కేంద్ర బడ్జెట్.. దేశ చరిత్రలో తొలిసారి..

ఫిబ్రవరి 1 ఆదివారం అయినప్పటికీ అదే రోజు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధికారికంగా ప్రకటించారు. ఇలా ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సారి బడ్జెట్ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.
News January 12, 2026
సికింద్రాబాద్ పేరు మార్చట్లే: CM రేవంత్ రెడ్డి

సికింద్రాబాద్ అస్తిత్వాన్ని తగ్గించేలా చేస్తే ఊరుకోబోమని, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న ఉద్యమానికి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఓ సమాధానం చెప్పారు. సికింద్రాబాద్ పేరు మార్చట్లే, రాచకొండ ఒక్కటే రాజరికంలా ఉందని ఆ పేరు మార్చామన్నారు. కాగా..సిటీ కమిషనరేట్ పునర్వ్యవస్థీకరణలో రాచకొండ కమిషనరేట్ బదులుగా మల్కాజిగిరి కమిషనరేట్ ప్రాంతాన్ని ఏర్పాటు చేశారు.


